విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. పర్సనల్ లైఫ్ గురించి పక్కన పెడితే ఆన్ స్క్రీన్ పై వీరిది టాప్ క్లాస్ జోడి. `గీత గోవిందం` సినిమాలో తొలిసారి జంటగా నటించిన విజయ్-రష్మిక ప్రేక్షకుల హృదయాల్లో ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. `డియర్ కామ్రేడ్` సినిమాలో మ‌రోసారి ఈ జంట‌ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ చిత్రం ఫ్లాప్ అయినప్పటికీ విజయ్-రష్మిక ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కి మంచి మార్కులు పడ్డాయి. కానీ ఆ తర్వాత మళ్లీ వీరిద్దరూ జంటగా వెండితెర‌పై కనిపించలేదు.


అయితే వీరిద్దరి కాంబినేషన్లో రీసెంట్‌గా ఓ బ్లాక్ బ‌స్టర్ మూవీ మిస్ అయిందన్న సంగతి మీకు తెలుసా..? ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు `కుబేర`. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ ఎమోషనల్ డ్రామాలో ధనుష్ హీరో కాగా.. కథలో అత్యంత ముఖ్యమైన క్యారెక్టర్ లో నాగార్జున నటించారు. హీరోయిన్‌గా రష్మిక చేసింది. గత నెలలో రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుని బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. కుబేరలో ఒక బిచ్చగాడిగా ధనుష్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు.


అయితే ధనుష్ పోషించిన దేవా పాత్రకు ఫస్ట్ ఛాయిస్ విజయ్ దేవరకొండ అని తాజాగా ఓ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. దేవా పాత్రకు విజ‌య్ మాస్ అప్పీల్ సరిపోతుందని మేకర్స్ భావించారట‌. అయితే స్టోరీ విన్నాక ఒక బిచ్చగాడిగా ప్రేక్ష‌కులు త‌న‌ను ఇష్ట‌ప‌డ‌రేమో అన్న భయంతో విజయ్ కుబేర సినిమాను సున్నితంగా తిర‌స్క‌రించాడ‌ట‌. ఆ త‌ర్వాత అదే స్టోరీని ధ‌నుష్ ఒకే చేశాడు. క‌ట్ చేస్తే సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. కుబేర మూవీ చూశాకా ధ‌నుష్‌కు నేష‌న‌ల్ అవార్డు గ్యారెంటీ అన్న‌వారు ఎంద‌రో ఉన్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: