
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ .. టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున కీలక పాత్రలో రష్మిక మందన్న నటించగా .. టాలీవుడ్ మ్యూజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సినిమా కుబేర. మన తెలుగు వాళ్ళు అయిన ఏషియన్ ఎంటర్టైన్మెంట్ అధినేత ఏషియన్ సునీల్ నిర్మించిన కుబేర సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ధనుష్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ కథాంశం తో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మూడో వారంలోకి ఎంటర్ అయ్యాక కూడా మంచి బుకింగ్స్ నమోదు చేస్తోంది. యుఎస్ మార్కెట్లో అయితే కుబేర సాలిడ్ బుకింగ్స్ నమోదు చేస్తుండటం విశేషం. ఇప్పటికే అక్కడ కుబేర 2.4 మిలియన్ డాలర్ల మార్కు క్రాస్ చేయడం విశేషం.
మూడో వారంలోకి ఎంటర్ అయ్యాక కూడా కుబేర మంచి వసూళ్లు సాధిస్తోంది. ఓవర్సీ స్‌లో ఈ సినిమా భారీ లాభాలు కల్ల చూసింది. దీంతో అక్కడ కుబేర సినిమా ఎలా రాణిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో జిమ్ షర్బ విలన్ పాత్రలో నటించిగా హీరోయిన్గా రష్మిక మందన్న నటించింది. టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కుబేర సినిమా అందరికీ భారీ లాభాలు తెచ్చిపెట్టింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణ లో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు