"తమ్ముడు".. నితిన్ తాజాగా నటించిన సినిమా . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ తమ్ముడు చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు . ఈ సినిమాలో వర్షాబల్లమ్మ.. సప్తమి గౌడ .. కీలక పాత్రలు పోషించారు . పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా డైరెక్టర్ చేసిన వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం వెరీ వెరీ హైలెట్.  జూలై 4న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే సినిమా రిలీజ్ అయిన మొదటి షోకే నెగిటివ్ టాక్ సంపాదించుకుంది . సినిమా కథ పెద్దగా కొత్తగా లేకపోవడం థియేటర్లో సినిమా రన్ అవుతూ ఉంటే ఆ సినిమాకి సంబంధించిన సీన్స్ ని ముందే జనాలు ప్రిడిక్ట్ చేయడం సినిమాకి మరింత నెగటివ్గా మారింది. అయితే ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ కూడా కేవలం సింగిల్ డిజిట్ కోట్లే కలెక్ట్ చేయడంతో ఫాన్స్ బాగా డిసప్పాయింట్ చేసింది .


వరుస ఫ్లాప్ లతో సతమతమవుతుందని ఈసారి కెరీర్ నిలబడాలి అంటే కచ్చితంగా హిట్ కొట్టాలన్న ఉద్దేశంతోనే ఈ తమ్ముడు సినిమాను ఓకే చెప్పారు అని ప్రమోషన్స్ లో భాగంగా బయటపడింది . అయితే సినిమా నెగిటివ్ టాక్ సంపాదించుకోవడంతో కలెక్షన్స్ కూడా పూర్తిగా పడిపోయాయి . మరీ ముఖ్యంగా తమ్ముడు సినిమా కోసం 75 కోట్ల రూపాయలు బడ్జెట్ అయ్యింది అంటూ ఓ  న్యూస్ బయటకు వచ్చింది . అయితే ఈ సినిమా ఎంత రాబట్టింది..? సినిమాకి లాభం ఎంత ..?నష్టం ఎంత..? అనే విషయాలు ఇప్పుడు చదివి తెలుసుకుందాం..!



నైజాం ఏరియాలో తమ్ముడు సినిమాకి 8.5 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది . సీడెడ్ లో మూడు కోట్ల రూపాయలు.. ఇతర జిల్లాలలో 8.5 కోట్ల రూపాయలు చొప్పున తమ్ముడు చిత్రానికి ఆంధ్ర నైజాంలో కలిపి దాదాపు 20 కోట్ల మీద ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే ఓవర్సీస్ లో మాత్రం నాలుగు కోట్ల రూపాయల ఫ్రీ బిజినెస్ చేసింది అంటూ ట్రేడ్ వర్గాలు తెలిపాయి . దీనితో కలుపుకొని తమ్ముడు చిత్రానికి మొత్తం ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల మీద బిజినెస్ జరిగింది . నితిన్ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలి అంటూ ట్రేడ్ పండితులు చెప్తున్నారు . తమ్ముడు చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్ లలో గ్రాండ్గా విడుదల చేశారు.  కానీ సినిమాకి మాత్రం నెగిటివ్ టాక్ వచ్చింది. తమ్ముడు సినిమా కేవలం 85 లక్షల కలెక్షన్స్ మాత్రమే అందుకోగలిగింది ఓవర్సీస్ లో...



తమ్ముడు సినిమా ఇండియా వైడ్ తొలి రోజు 1.9 కోట్లు రెండవ రోజు 1,16 కోట్లు ..మూడో రోజు 1.28 కోట్లు ..నాలుగో రోజు 50 లక్షలు ఐదో రోజు 40 లక్షల నెట్ కలెక్షన్ సాధించింది . దీంతో మొత్తంగా చూసుకుంటూ ఐదు రోజుల కలెక్షన్స్ తమ్ముడు మూవీ మొత్తం కలిపి 5.41 కోట్లే 6.75 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టింది.  ప్రపంచవ్యాప్తంగా 7.60 కోట్ల రూపాయలు మాత్రమే అర్జించిన్నట్లు  ట్రేడ్ వర్గాలు తెలిపాయి . తమ్ముడు సినిమాకి నష్టం ఎంత ..? 25 కోట్ల రూపాయల ప్రి రిలీజ్ బిజినెస్ కు గాను ఏ ఏరియాలోను తమ్ముడు మూవీ గట్టేక్కలేకపోయింది . 12 శాతం రికవరీతో ఐదు రోజుల వరకు కేవలం మూడు కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ షేర్ వచ్చింది. దాదాపు 75 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ని ఈ సినిమా కోసం కేటాయించారు . అంటే సుమారు 70 కోట్లకు పైగానే ఈ సినిమాకి నష్టం జరిగింది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  అయితే ధియేట్రికల్ బిజినెస్.. ఓటిటి రైట్స్ .. సాటిలైట్ రైట్స్ .. ఆడియో రైట్స్ ద్వారా దిల్ రాజు ఈ కష్టాల నుంచి గట్టు ఎక్కే అవకాశాలు ఉన్నాయి అంటూ ట్రేడ్ పండితులు అంచనవేస్తున్నారు . చూడాలి మరి ఏం జరుగుతుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: