
ఇక మైకేల్ తో ప్రేమ, బ్రేకప్ తర్వాత మళ్లీ శాంతాను హజారికా తో కొన్నేళ్లు డేటింగ్ చేసింది శృతిహాసన్. కొన్ని కారణాల చేత మళ్లీ వీరిద్దరూ విడిపోయారు. దీంతో ప్రేమ పెళ్లి విషయంలో శృతిహాసన్ చాలా అసహనంతో ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి.ఇటీవలే ఒక చిట్ చాట్ లో భాగంగా శృతిహాసన్ మాట్లాడుతూ వివాహం చేసుకోవాలి అంటే ఇరువురి మధ్య నిబద్దత, విధేయత అనేవి ఉండాలి అవి ఒకరిలో ఉంటే కలిసి ఉండలేము అంటూ తెలియజేసింది. అందుకే తనకు చిరాకుగా మారిపోయింది అంటూ తెలియజేసింది
ప్రస్తుతం తాను ఒంటరి జీవితాన్ని చాలా ఆనందంగా జీవిస్తున్నానని ఒంటరిగా ఉండడం తనకేమి కొత్త కాదు అంటూ తెలిపింది. తన జీవితంలో ఎక్కువకాలం ఒంటరిగానే ఉన్నానని తెలిపింది. అంతేకాకుండా ఒంటరిగా ఉండడం అనేది కూడా తప్పేం కాదు కదా అన్నట్లుగా వెల్లడించింది శృతిహాసన్. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఇప్పట్లో శృతిహాసన్ కి పెళ్లి చేసుకొని ఉద్దేశం లేదని కనిపిస్తోంది. అంతేకాకుండా గతంలో తన తల్లి పడిన కష్టాలు సింగల్ మదర్ గా ఎదుర్కొన్న కష్టాలను తాను దగ్గరుండి చూశానని అందుకే వివాహ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా తెలియజేస్తోంది. మరి ఇప్పటికే రెండుసార్లు లవ్ లో ఫెయిల్ అయిన శృతిహాసన్ మరి పెళ్లి బంధంలో ఎప్పుడు అడుగుపెడుతుందో చూడాలి.