తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. చిరంజీవి చాలా కాలం క్రితమే మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంబర అనే మూవీ ని మొదలు పెట్టాడు. ఈ సినిమాను స్టార్ట్ చేశాక ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమాకు సంబంధించిన చాలా పనులు పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఈ మూవీ విడుదల తేదిని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా కొత్త విడుదల తేదీని మాత్రం ఇప్పటివరకు ఈ మూవీ బృందం వారు ప్రకటించలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీ కి సంబంధించిన కేవలం ఒకే ఒక సాంగ్ షూటింగ్ మినహా మొత్తం షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఇక మిగిలి ఉన్న ఈ సాంగ్ ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ అని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. కానీ ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ మాత్రం కీరవాణి సంగీతం అందించడం లేదు అని తెలుస్తుంది.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన జోష్లో కెరియర్ను కొనసాగిస్తున్న సంగీత దర్శకులలో ఒకరు అయినటువంటి భీమ్స్ సీసీరోలియో ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ కి సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం అద్భుతమైన జోష్లో కెరిర్ను కొనసాగిస్తున్న భీమ్స్ ఒక్కో సినిమాకు ఏకంగా నాలుగు కోట్ల వరకు పారితోషకం అందుకుంటున్నట్టు తెలుస్తుంది. కానీ చిరంజీవి సినిమాలో ఒక సాంగ్ చేయడం కోసం మాత్రం ఈయన ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోవడం లేదు అని తెలుస్తుంది. ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి , అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి కూడా బీమ్స్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: