
రీసెంట్గా ఈ సినిమాను గజల్ నాయకుడు టెంపుల్ భారత సంస్థ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ కి చూపించారు మోహన్ బాబు. జూలై 8వ తేదీన విజయవాడలో అఘోరాలు .. సాధువులు.. నాగసాధువులు.. పీఠాధిపదులతో కలిసి మోహన్ బాబు కన్నప్ప సినిమాను చూశారు . ఆ తర్వాత ఈ సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ స్వామి సదానందగిరి ఓపెన్ గా సినిమాలోని నెగిటివ్ ఏంటి అనేది చెప్పుకొచ్చాడు . "ఆంధ్రలో తిరిగినప్పుడు అప్పుడెప్పుడో లవకుశ ..శంకరాభరణం చూసాం మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఒక నిజమైన కథ చూశాం. భక్తకన్నప్ప అర్జునుడి గురించి మాకు తెలుసు ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని కన్నప్ప సినిమాను ఇంకా బాగా తెరకెక్కించారు . సినిమా చాలా బాగుంది ఈ సమాజానికి అవసరమైన కొంచెం మసాలా కూడా పెట్టినప్పటికీ నిజమైన భక్తిని దర్శకుడు రచయిత చాలా అద్భుతంగా తెరకెక్కించారు.. చూపించారు"..
"సన్యాసులమైన మాకు కన్నప్ప రెండోసారి చూడాలనిపించింది . కానీ ఆ రెండు పాటలు లేకుంటే మాత్రం కచ్చితంగా మరోసారి చూసే వాళ్లం.. అది మా సన్యాసి బుద్ధి. అయినా పాటల్లో ఎటువంటి అసభ్యత లేదు . ఆ కాలపు నాగరిత ఆధారంగానే బేస్ చేసుకొని పాటలను చిత్రీకరించారు అంటూ కామెంట్స్ చేశారు . ప్రజెంట్ ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చాలామంది కూడా కన్నప్ప సినిమా చూసిన తర్వాత ఇదే రివ్యూస్ ఇస్తున్నారు . కన్నప్ప సినిమా చాలా బాగుందని ఆ రెండు పాటలు కొంచెం మసాలా తగ్గించి ఉంటే ఫ్యామిలీ అంతా కూడా కలిసికట్టుగా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తుండే వాళ్ళు అని.. కానీ ఎక్కడా కూడా హద్దులు మీరిన సీన్స్ లేకపోవడంతో కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అంటూ కామెంట్స్ చేశారు . కొంతమంది కన్నప్ప సినిమా విషయంలో మంచి విష్ణు తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా బాగా సక్సెస్ అయ్యాయి అంటూ ఆయనని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. త్వరలోనే బిగ్ ప్రాజెక్ట్ తో మన ముందుకు రాబోతున్నాడు విష్ణు. ప్రభుదేవా తో ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేసారట మంచు విష్ణు..!!