
దీంతో సోషల్ మీడియాలో దేవిశ్రీప్రసాద్ పేరు మారుమ్రోగిపోతుంది . దేవిశ్రీప్రసాద్ ఏ ఈవెంట్ అయినా సరే పాటలను ఎంత చక్కగా పాడుతారో.. ఎంత బ్రీతింగ్ కంట్రోల్ చేసుకుంటాడో అందరికీ తెలుసు. అయితే దేవిశ్రీప్రసాద్ అలా ఎలా పాటలు పాడగలరు ..? కొంచమైనా ఊపిరి తిప్పుకోకుండా పాటలు పడడం కష్టం గా..? మరి ఆయనకు అది ఎలా సాధ్యం ..? అనే విషయాలను రీసెంట్గా బయటపెట్టారు . "మీకు బ్రీతింగ్ బాగుంటే మీరు ఎంత కష్టమైనా శారీరక కదలికనైన సులభంగా చేస్తూనే బ్రీత్ ని కంట్రోల్ చేసుకోగలరు . మరి ముఖ్యంగా పాటలు పాడాలి అంటే పాటలు పాడుతూ డాన్స్ చేయాలి అంటే శరీరానికి మంచి ట్రైనింగ్ అవసరం అంటూ తెలియజేశారు".
అంతేకాదు ప్రతిరోజు దేవిశ్రీప్రసాద్ "వాకింగ్.. రన్నింగ్ ..జంపింగ్ లేదా స్కిప్పింగ్" ఏదో ఒకటి కచ్చితంగా చేస్తారట. తద్వారా ఆయనకు అది ఫిజికల్ యాక్టివిటీగా మారుతుందట . అంతేకాదు స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చే ముందు అస్సలు ఆహారమే తీసుకోరట . ఎందుకంటే కడుపునిండా తిని స్టేజి ఎక్కితే ఒళ్ళు బరువుగా అనిపిస్తుంది . ఎనర్జీ మిస్ అయిపోతాం . పాటలు పాడలేం అంటూ చెబుతున్నారు . ఖాళీ కడుపుతో స్టేజి ఎక్కితే బాడీ చాలా ఫ్రీగా అనిపిస్తూ .. జింక పిల్లల చెంగుచెంగును ఎగురుతూ పాటలు పాడుతూ మనము ఎంజాయ్ చేయొచ్చు . ఎదుటి వాళ్ళని మన పాటలతో అలరించొచ్చు అంటూ చెప్పుతున్నారు . దీంతో సోషల్ మీడియాలో దేవిశ్రీప్రసాద్ డైట్ ప్లాన్ సీక్రెట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా చాలా రోజుల నుంచి దేవిశ్రీప్రసాద్ సీక్రెట్ ఏంటి..? ఏంటి..? అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడిచింది . ఇన్నాళ్లకు ఆ సీక్రెట్ ను బయట పెట్టేసాడు దేవి శ్రీ ప్రసాద్..!!