దక్షిణాది హీరో మాధవన్ నటించిన తాజా మూవీ ఆఫ్ జైసా కోయి. దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్, మాధవన్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాధవన్ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మాధవన్ అమ్మాయిల మైండ్ సెట్ గురించి మాట్లాడుతూ.. అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువగా పురుషులనే అంటే ఎక్కువ ఏజ్ ఉన్న వారినే ఇష్టపడతారు అంటూ మాట్లాడడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న మాధవన్ కి అమ్మాయి అబ్బాయి మధ్య ఏజ్ డిఫరెన్స్ గురించి ప్రశ్న ఎదురైంది. 

అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు మనవరాలు వయసున్న హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే చాలామంది హీరోల విషయంలో ఈ ట్రోలింగ్ జరిగింది. కానీ ఆ ప్రశ్నలకు హీరో హీరోయిన్లు గట్టి కౌంటర్ కూడా ఇస్తారు. అయితే తాజాగా వచ్చిన ఆప్ జైసా కోయి సినిమాలో నటించిన మాధవన్,ఫాతిమాల మధ్య కూడా దాదాపు 23 ఏళ్ల వ్యత్యాసం ఉంది. అలా ప్రమోషన్స్ లో భాగంగా ఏజ్ గురించి ప్రశ్న ఎదురవగా నేను ఇప్పటివరకు చాలామంది అమ్మాయిలను ప్రశ్నించాను. అమ్మాయిలు అందరూ తమ ఏజ్ ఉన్న అబ్బాయిల కంటే ఎక్కువ ఏజ్ ఉన్న పురుషులనే ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళ మైండ్ సెట్ పరిణితి చెంది ఉంటుంది.

కాబట్టి ఏ విషయం అయినా సరే చాలా తొందరగా అర్థం చేసుకోవడంతో పాటు అమ్మాయిలు మెచ్యూరిటీ లేకుండా తొందర పడ్డా ఎక్కువ ఏజ్ ఉన్న పురుషులు దాన్ని అర్థం చేసుకొని మెదులుతారు. ఈ ఒక్క అంశమే అమ్మాయిలు అబ్బాయిల కంటే పురుషులను ఎక్కువగా ఇష్టపడేలా చేస్తుంది. ఇలా ఏర్పడిన బంధం శాశ్వత బంధంగా కూడా మారుతుంది అంటూ మాట్లాడారు. ఇక ఈ మాటలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. అబ్బాయిలకు అమ్మాయిలకంటే ఆంటీలు అంటే ఎలా ఇష్టమో అమ్మాయిలకు కూడా తమ ఏజ్ ఉన్న అబ్బాయిల కంటే అంకుల్స్  అంటేనే ఇష్టం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇదే సినిమా ప్రమోషన్స్ లో పెళ్లైన హీరోయిన్లు రొమాన్స్ కి పనికిరారు అంటూ మాధవన్ మాట్లాడిన సంగతి మనకు తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: