నిన్న థియేటర్లలో విడుదలైన జూనియర్ సినిమాకు ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని వైరల్ వయ్యారి సాంగ్  ఊహించని స్థాయిలో  హిట్టైంది. ఈ సాంగ్ కు సంబంధించిన రీల్స్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయ్యాయి. ఈ సాంగ్ లో కిరీటి, శ్రీలీల వేసిన స్టెప్పులు సోషల్ మీడియా వేదికగా  సంచలనం అవుతున్నాయి. వైరల్ వయ్యారి స్టెప్పుల వెనుక ఉన్న వ్యక్తి  నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

 మంచి డ్యాన్సర్ గా ఎదగాలనే తల్లి  కలను   నిజం చేయడానికి రేవంత్ మాస్టర్ ఎంతో  కష్టపడ్డారు.  మణుగూరులోని  సుభద్ర, వెంకటేశ్వర్లు దంపతుల కుమారుడైన రేవంత్  ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నాడు.  తండ్రి మరణం అనంతరం శేఖర్ మాస్టర్   దగ్గర రేవంత్  అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరారు.  ఢీ  షోలో  సైడ్ డ్యాన్సర్ గా చేరిన  రేవంత్  ఢీ 9 సీజన్  లో  కంటెస్టెంట్ గా చేరడంతో పాటు  ఢీ15 సీజన్ లో  సెకండ్ ఫైనలిస్ట్ గా నిలిచారు.

వందకు పైగా పాటలకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసిన అనుభవం  రేవంత్ కు ఉంది.  వైరల్ వయ్యారి సాంగ్ తో  కొరియోగ్రాఫర్ గా తోలి ఛాన్స్ దక్కగా  యూట్యూబ్ లో ప్రస్తుతం ఈ  పాట  నంబర్ వన్ స్థానంలో  ట్రేండింగ్ అవుతోంది.  ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ కు కూడా రేవంత్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు.  అమ్మ సహకారంతో పాటు  గురు  సమానులైన  శేఖర్ మాస్టర్  నేర్పించిన మెలకువలతో  వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నానని   వెల్లడించారు.

చిరంజీవితో కొరియోగ్రాఫర్ గా పని చేయాలనేది నా కల అని ఆయన చెబుతున్నారు.  రేవంత్ మాస్టర్  చెప్పిన విషయాలు  సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.  మంచి మూవీ ఆఫర్లు వస్తే  రేవంత్ మాస్టర్ స్టార్ కొరియోఫగ్రాఫర్  స్టేటస్ ను  అందుకోవడానికి  ఎంతో  కాలం పట్టదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: