నమ్రత, శిల్పా శిరోద్కర్ ఇద్దరు కూడా అక్కచెల్లెళ్లే.. వెండితెరపై హీరోయిన్గా రాణించారు. విరు ఎక్కువగా హిందీ చిత్రాలలో నటించారు. నమ్రత వంశీ, అంజి వంటి చిత్రాలలో నటించింది. ఆ తర్వాత మహేష్ బాబుని పెళ్లి చేసుకుని సినీ ఇండస్ట్రీకి దూరమయ్యింది. శిల్పా శిరోద్కర్ బాలీవుడ్లో పలు చిత్రాలలో నటించిన తెలుగులో బ్రహ్మ అనే ఒక చిత్రంలో మాత్రమే నటించింది. వివాహం అనంతరం ఈమె కూడా వెండితెరకు దూరమై న్యూజిలాండ్ సెటిల్ అయ్యింది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తెలియజేసింది శిల్పా.



2010లో న్యూజిలాండ్ నుంచి ఇండియాకి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయిందట. అందుకు గల కారణాలను వివరిస్తూ.. సినిమా అవకాశాల కోసం తాను తిరిగి రాలేదని అప్పుడు తన మానసిక పరిస్థితి అంత సరిగ్గా లేదని వెల్లడించింది.. తల్లిదండ్రులను కోల్పోయి చాలా దుఃఖంలో ఉన్నాను, డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను.. దాంతో తన అక్క నమ్రత దగ్గరైన ఉండవచ్చని న్యూజిలాండ్ నుంచి తాను వచ్చేసానని తెలిపింది. 2010లో తాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరిని పని కోసం ఆర్జించలేదంటూ తెలిపింది.


తన మనసులో ఉన్నదల్లా కేవలం ఒక్కటే.. తాను ఎక్కడికి వెళ్ళకూడదు..మా అక్కకు దగ్గరగా ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. అప్పుడు శిల్పా భర్త ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో ఉన్నరట. తన కూతురు కూడా స్కూలుకి వెళ్తోందని.. అలా సంతోషంగా కొనసాగుతున్న సమయంలో తల్లితండ్రులు ఒకరి తర్వాత ఒకరు కాలం చెల్లించడంతో తట్టుకోలేకపోయానని తెలిపింది. ఈ విషయం నుంచి బయటపడడానికి చాలా ఏళ్లు పట్టిందని.. ఎప్పుడు కన్నీళ్లు పెట్టుకునే దాన్ని దేని పైన పెద్దగా ఆసక్తి రాలేదు. కేవలం ఒక రోబోలాగా మారిపోయానని తెలిపింది.


అధిక బరువు పెరిగి కళ్ళ కింద నల్లటి వలయాలు వచ్చేసాయి. కేవలం తన కూతురిని స్కూలు నుంచి ఇంటికి, ఇంటి నుంచి స్కూలుకి దింపిరావడం వంటి పనులు మాత్రమే చేస్తూ ఉండేదాన్ని ఎవరితో కూడా మాట్లాడలేదంటూ తెలిపింది. కొన్నిసార్లు తన తలను తానే గోడకేసి బాదుకొనే దాన్నే ఇలా ఎన్నోసార్లు జీవితం మీద విరక్తి వచ్చిందంటూ తెలిపింది. ఆ సమయంలో వైద్యులను కలవగా.. వారు మందులు వాడమని సలహా ఇచ్చారు.. వాటి వల్ల తన భర్త పైన, కూతురు పైన ఎక్కువగా అరిచే దాన్ని కొన్ని సందర్భాలలో తన కూతుర్ని కూడా కొట్టేదాన్ని అంటూ తెలిపింది.. కాని చివరికి తన అక్క దగ్గర చాలా బాగా మాట్లాడేదాన్ని తన అక్క ఒక్కటే నన్ను అర్థం చేసుకునేదని అందుకే న్యూజిలాండ్ నుంచి ఇండియాకి వచ్చి ఇక్కడే ఉన్నామని తెలిపింది.. ఇక తన భర్త మంచి ఉద్యోగాన్ని కూడా వదిలేసి తనకోసం ఇక్కడికి వచ్చారని వెల్లడించింది శిల్ప శిరోద్కర్.

మరింత సమాచారం తెలుసుకోండి: