- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ అభిమానులెందరో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఎన్నో వాయిదాల అనంత‌రం వీర‌మ‌ల్లు ఈ నెల 24న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది ప‌వ‌న్‌ డిప్యూటీ సీఎం హోదాలో విడుదలవుతున్న తొలి సినిమా కావడం, అలాగే చారిత్రక నేపథ్యం, భారీ బడ్జెట్‌ కావడంతో ఈ సినిమా చుట్టూ భారీ హైప్ నెలకొంది. ఈ సినిమా విడుదల కోసం ఉత్తరాంధ్రలో తుఫాన్ రిలీజ్ కాబోతోంది. పవన్ కళ్యాణ్‌కు ఆ ప్రాంతంలో ఉన్న ఫాలోయింగ్ మామూలుగా ఉండ‌దు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో పవన్‌కు అభిమానుల ఊచకోత దెబ్బ‌కు వీర‌మ‌ల్లు డే 1 రికార్డుల మోత మోగిపోనుంది.


ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఉత్తరాంధ్రలోని మొత్తం 150 థియేటర్లలో ఏకంగా 135 థియేటర్లు హరిహర వీరమల్లు సినిమాకే కేటాయించారు. ఇది పవన్ కెరీర్‌లోనే కాదు, ఆ ప్రాంత చరిత్రలో కూడా ఒక రికార్డుగా నిల‌వ‌నుంది. మొదటి వారం పూర్తి అయ్యే సరికి ఈ సినిమా 125 థియేటర్లలో కొనసాగనుంద‌ని సమాచారం.  ఈ స్థాయిలో థియేటర్ లాకింగ్ అనేది ఒక్క ప‌వ‌న్‌కు మాత్రమే సాధ్యమవుతుంది. ప్రీమియర్ షోలు, అడ్వాన్స్ బుకింగ్స్‌తో కలిపి మొదటి రోజు వసూళ్లు పవన్ గత సినిమాలకన్నా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్‌లు హౌస్‌ఫుల్‌ కావడమే దీనికి నిదర్శనం.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: