సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరోకి , హీరోయిన్ కి కొన్ని కొన్ని ట్యాగ్స్ ఉంటాయి . మరీ ముఖ్యంగా ప్రతి హీరోకి ట్యాగ్స్ ఉంటాయి అనేది మనకి తెలుసు.  కానీ హీరోయిన్స్ కి రేర్ గా మాత్రమే ఉంటాయి. చాలా చాలా ఇష్టమున్న హీరోయిన్స్ కి మాత్రమే అభిమానులు ట్యాగ్స్ ఇస్తూ ఉంటారు.  మరి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమందికి కొన్ని ట్యాగ్స్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోతూ ఉంటాయి.  కాజల్ కి చందమామ అని ..అనుష్కకి జేజమ్మ అని ..హన్సికకి ఆపిల్ బ్యూటీ అని ఇలా రకరకాలుగా ట్యాగ్స్ ఉన్నాయి .


అయితే మిల్కీ బ్యూటీ అనగానే అందరికీ గుర్తొచ్చేది తమన్నా.  తమన్నా ఫిగర్ చూసి ఆమె కలర్ చూసి అందరూ కూడా మిల్కీ బ్యూటీ మిల్కీ బ్యూటీ అంటూ పిలుచుకుంటూ ఉంటారు. అయితే తమన్నా ని ఇకపై మిల్కీ బ్యూటీ కాదు నాటీ బ్యూటీ అని పిలవాలి అంటూ ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారు. దానికి కారణం బ్యాక్ టు బ్యాక్ రెండు బిగ్ పాన్  ఇండియా ప్రాజెక్ట్ లో ఐటమ్ సాంగ్స్ ఓకే చేయడం. ఇప్పుడు  సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది . ప్రభాస్ హీరోగా నటిస్తూ మారుతి దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా "రాజా సాబ్".



డిసెంబర్ 5వ తేదీ గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .  ఈ సినిమా కోసం జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.  అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ముందుగా బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ ని అనుకున్నారట మూవీ మేకర్స్. కానీ ఆమె కొన్ని కారణాలు చేత ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేయడంతో అది తమన్నా వద్దకు చేరినట్లు తెలుస్తుంది . ఆమె ఓకే కూడా చేసేసిందట. హీరోయిన్ తమన్నా ఇప్పుడు ప్రభాస్ మూవీలో స్పెషల్ సాంగ్ చేయబోతుంది అన్న వార్త బాగా వైరల్ గా మారింది . అంతేకాదు "పెద్ది" సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ లో నటించబోతుందట . రామ్ చరణ్ తో  ఆల్రెడి హీరోయిన్ గా చేసింది.  ప్రభాస్ తో హీరోయిన్ గా చేసింది.  ఇప్పుడు ఆ ఇద్దరితోనే మళ్లీ స్పెషల్  సాంగ్ లో కనిపించబోతుంది . ఇది నిజంగా నాటి బ్యూటీ అంటూ తెగ పొగిడేస్తున్నారు జనాలు.  చూడాలి మరి రెండు పాటలతో తమన్న తన కెరియర్ ని ఏ విధంగా మలుపు తిప్పుకోబోతుందో అనేది..??

మరింత సమాచారం తెలుసుకోండి: