- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

దాదాపు ఐదేళ్ల నిరీక్షణకు తెర వేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ప్రతిష్టాత్మక సినిమా "హరిహర వీరమల్లు" విడుదలవడంతో. ఈ సినిమా పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో, అంచనాలు ఆకాశాన్ని తాకాయి. రిలీజ్ కి ముందు ఎన్నో లేట్‌లు, మార్పులు, ప్రతిష్టంభనలు ఎదురైనా చివరకు ఇది థియేటర్స్‌ లో విడుదలై, భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ ఓపెనింగ్స్‌లోని క్రేజ్ చూస్తే పవన్ కళ్యాణ్ స్టామినా ఏ రేంజ్ లో ఉందో మరోసారి రుజువైంది. కథ, నటన, సంగీతం, ఎమోషనల్ మూమెంట్స్ వంటి చాలా అంశాలపై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన వచ్చినా సినిమా చూసిన వెంటనే ఒక్క బిగ్గెస్ట్ నెగెటివ్ పాయింట్ మాత్రం ఏకంగా ప్రతి ఒక్కరి నోటి నుంచి వినిపించిందంటే అది విజువల్ ఎఫెక్ట్స్ గురించే.


సినిమా ట్రైలర్ విడుదలయ్యే సరికి కొంతమంది విజువల్స్ పట్ల సందేహం వ్యక్తం చేసినా, "ఫైనల్ వర్షన్‌లో చూస్తే మరోలెవెల్ ఉంటుందేమో" అన్న ఆశలు పెట్టుకున్నారు. కానీ సినిమాను థియేటర్లో చూశాక చాలామందికి మిక్సడ్ ఫీలింగ్ వచ్చింది. ముఖ్యంగా వార్ సీన్స్, కొంతమంది క్యారెక్టర్ల ప్రెజంటేషన్, హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్స్, క్లైమాక్స్ విజువల్స్ ఇలా చాలా చోట్ల వీఎఫ్‌ఎక్స్ చాలా ద‌రుణంగా ఉంది. పీరియాడిక్ సినిమాగా రూపొందిన హరిహర వీరమల్లు, విజువల్స్ పరంగా గ్రాండియర్ గా ఉండాల్సిన అవసరం ఉంది. తెరపై వార్ విజువ‌ల్స్ చూసినప్పుడు ప్రేక్షకులు కొంతవరకు డిసప్పాయింట్ అయ్యారు. క్లైమాక్స్‌లోని కొన్ని కీ సీన్స్, యాక్షన్ పార్ట్స్‌లో గ్రాఫిక్స్ అవసరమైన స్థాయికి చేరకపోవడం, విజువల్ క్వాలిటీ అప్‌డేట్ కాలేదు. వీఎఫ్ఎక్స్ విషయంలో శ్రద్ధ పెట్టి ఉంటే ఈ సినిమా స్థాయి మరో మెట్టు ఎక్కేద‌న్న‌ అభిప్రాయం అభిమానుల నుంచే కాకుండా సాధారణ ప్రేక్షకుల నుంచి కూడా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: