
ఈ పాత్రకి ఆయన ప్రాణం పోశాడు అని.. కచ్చితంగా ఆయనకు మంచి సినీ కెరీర్ ఉంటుంది అని మాట్లాడుకుంటున్నారు. క్రిష్ జాగర్లమూడి , జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ పిరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది . ఈ సినిమా ప్రీమియర్స్ నిన్న రాత్రి 9:30 నిమిషాలకు పడ్డాయి . థియేటర్స్ లో సినిమా చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉండిపోయారు . చాలాకాలం తర్వాత పవన్ కళ్యాణ్ ని తెరపై చూడడం ఒక రీజన్ అయితే..ఇలాంటి ఒక గెటప్ లో చూడడం ఇంకా ఇంకా హైలైట్ గా మారింది .
అంతేకాదు సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ ని తెగ పొగిడేస్తున్నారు . ఆ తర్వాత అంతలా హిట్ అయిన క్యారెక్టర్ మాత్రం బాబి డియోల్ దే. ఔరంగజేబు పాత్రలో ప్రాణం పెట్టినటించారు. అయితే నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా భగవంత్ కేసరి విలన్ బాలీవుడ్ హ్యాండ్సమ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ నొ అనుకున్నారట . కొన్ని రోజులపాటు అతనితో షూటింగ్ కూడా చేశారట . అయితే సినిమా బాగా డిలే అవ్వడంతో డేట్స్ అడ్జస్ట్ అవ్వక అర్జున్ రాంపాల్ ఈ మూవీ నుంచి తప్పుకున్నారట . ఆ తర్వాత ఆ పాత్ర కోసం బాబీ డియోల్ ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సీన్స్ ను రీ షూట్ చేశారట . ఇక తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే . సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . మొదటి రోజే ఈ సినిమా పెట్టిన డబ్బులకి పూర్తిగా లాభాలు తీసుకొచ్చేస్తుంది అంటూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నిర్మాతలు . చూద్దాం ఏం జరుగుతుందో..???