సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి. ప్రముఖ నటుడు, ఎంపీ రవికిషన్ తాజాగా ఒక సందర్భంలో చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. బాల్యంలో తాను కఠిక పేదరికం అనుభవించానని ఆయన తెలిపారు. ఒక పాడ్ కాస్ట్ లో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను నా లైఫ్ ను చాలాసార్లు అసహ్యించుకునేవాడినని అన్నారు.

పేదరికంలో ఉన్న సమయంలో మమ్మల్ని చూసి చాలామంది  వెక్కిరించారని  నా తండ్రిని  ఎవరూ  హేళన చేయకూడదని  ఆ స్థాయికి నేను చేరుకోవాలని  చిన్నతనంలో  బలంగా నిశ్చయించుకున్నానని  పేర్కొన్నారు. ఈ భూమి  మీదకు వచ్చామంటే  ఏదో  ఒకటి చేసి పోవాల్సిందేనని ఆయన అన్నారు.  అంతే  కానీ  పక్కింటి వాళ్లకు  కూడా తెలియకుండా  అనామకులుగా చనిపోతే ఏం లాభమని అన్నారు.

కేవలం పిల్లల్ని  కనడానికో,  బంగ్లాలు కట్టడానికో  ఈ భూమిపైకి  రాలేదు కదా  అని వెల్లడించారు.  మనకంటూ  ఓ గురింపు ఉండాలని  ఒకసారి  మనకు పేరు  వచ్చిందంటే  డబ్బు  దానంతటదే  వస్తుందని బలంగా నమ్మానని రవికిషన్  చెప్పుకొచ్చారు.  ప్రతిరోజూ  జిమ్ కు వెళ్లాలని  కనీసం 5 కిలోమీటర్లు అయినా  పరుగెత్తాలని  200 పుషప్స్ చేయాలనీ ఆయన తెలిపారు.  శనగలను  నానబెట్టి తెల్లారి  ఆ నీళ్లను తాగండి అని ఆయన చెప్పుకొచ్చారు.

మీరు పెద్దవాళ్ళైనా ఇవన్నీ చేయొచ్చని  ప్రభుత్వం  ఉచితంగా ఇచ్చే నిత్యావసర వస్తువులను  ఇలా వాడుకోవచ్చని  కనీసం  సూర్యోదయానికి  ముందు లేవడమైనా అలవాటు  చేసుకోవాలని  ఆయన అన్నారు.   రవికిషన్ ప్రయాణం  పీతాంబర్  అనే సినిమాతో 1992లో మొదలైంది.  తెలుగు, కన్నడ,  హిందీ భాషల్లో  అనేక సినిమాలు చేశారని  ఆయన పేర్కొన్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: