పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ జంటగా వచ్చిన హరిహర వీరమల్లు మూవీ జూలై 24న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా మొదటి రోజే 30 కోట్ల కలెక్షన్లు సాధించినట్టు సినిమా విడుదలయ్యాక నిన్న రాత్రి జరిగిన సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ పంచుకున్నారు.. అయితే డిప్యూటీ సీఎం అయినా తనకు ఏది అంత ఈజీగా రాలేదని, తన సినిమా ఈజీగా రిలీజ్ చేసుకోవచ్చు అనుకున్నానని, కానీ సినిమా విడుదల చేసే సమయంలోనే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నేను స్వయంగా చూశాను అంటూ పవన్ కళ్యాణ్ సక్సెస్ ఈవెంట్లో చెప్పారు. అంతేకాదు సినిమా హిట్ అయిన ఆనందంలో పవన్ కళ్యాణ్ తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ దమ్ముంటే దాడి చేయండి అనే మాటలు ప్రస్తుతం మీడియాలో వైరల్ గా మారాయి.

 అయితే డిప్యూటీ సీఎం వంటి బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ నుండి ఈ మాటలు రావడం చాలామందికి సహించడం లేదు.ఒక బాధ్యతగల స్థాయిలో ఉన్న హీరో.. రాజకీయ నాయకుడు..మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అంటూ కొంతమంది నెటిజెన్లు ఆయన మాటల్ని వక్రీకరిస్తున్నారు. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి ఏం మాట్లాడారంటే.. మేము అన్ని టెక్నికల్ వాల్యూస్ మెరుగుపరచుకొని వాళ్ళిచ్చిన సలహాలు సూచనల మేరకు హరిహర వీరమల్లు సినిమాని కంప్లీట్ చేశాము. అలాగే వాళ్ళ సలహాల మేరకే హరిహర వీరమల్లు పార్ట్ 2 కూడా కంప్లీట్ చేస్తాం.. ఇక సోషల్ మీడియాలో ఎవరు ఏదో పెట్టారు అని దానికి ఎక్కువగా రియాక్ట్ అవ్వకూడదు. నలిగిపోకూడదు..

దమ్ముంటే తిరిగి దాడి చేయాలి. ఎలా దాడి చేయాలనిపిస్తే అలా దాడి చేయండి.నెగిటివ్ గా వచ్చే కామెంట్లను పక్కకు పెట్టండి. ఈ సినిమా ఏఎం రత్నం కోసమో.. పవన్ కళ్యాణ్ కోసమో తీసిన సినిమా కాదు. దేశం కోసం తీసిన సినిమా అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అయితే అంతా బాగానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ అభిమానులకు తిరిగి దాడి చేయండి..ఎలా దాడి చేయాలనిపిస్తే అలా దాడి చేయండి అంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవ్వడంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ గా మారాయి. అంతే కాదు చాలామంది పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ మాటల పట్ల విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: