సాధారణంగా సెలబ్రిటీల జీవితాలు  సంతోషంగా ఉంటాయని అందరూ  భావిస్తారు. అయితే పైకి నవ్వుతూ  కనిపించే ఎంతోమంది సెలబ్రిటీల నవ్వుల వెనుక  ఎన్నో కష్టాలు ఉంటాయి.  2022 సంవత్సరం సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బ్యాడ్ ఇయర్ అనే సంగతి  తెలిసిందే.  ఆ ఏడాది మహేష్ సోదరుడు,  మహేష్ తల్లి, మహేష్ తండ్రి మృతి చెందారు.  ఈ ఘటనలు మహేష్ బాబును ఎంతగానో బాధ పెట్టాయి.

మహేష్ మరదలు శిల్ప శిరోద్కర్ మాట్లాడుతూ  ఈ ప్రపంచంలో  నాకు తెలిసిన అత్యుత్తమ వ్యక్తులలో మహేష్ బాబు ఒకరని తెలిపారు.  మహేష్ బాబు కుటుంబం కోసం దృడంగా నిలబడతారని  మహేష్  ఎన్నో కష్టాలు చూశాడని తన కుటుంబ సభ్యులను కోల్పోయిన సమయంలో  తనను అభిమానించే వాళ్ళ కోసం మహేష్ బాబు చిరునవ్వుతో కనిపించేవాడని  చెప్పుకొచ్చారు.  మా పేరెంట్స్ ను కోల్పోయిన సమయంలో అక్కకు మహేష్ అండగా నిలిచాడని  ఆమె తెలిపారు.

నమ్రత నాకంటే వయస్సులో పెద్దదని  కానీ  సినిమాల్లోకి నేనే ముందు  వచ్చానని  నాకే మొదట పెళ్లయిందని  నాకే ముందు పాప పుట్టిందని  దీంతో అందరూ  నేనే పెద్దదాన్ని  అనుకుంటారని  నాకు పెళ్ళైన తర్వాత  నేను నమ్రతకు  మరింత క్లోజ్ అయ్యానని  ఆమె కామెంట్లు చేశారు.  మా పేరెంట్స్  చనిపోయిన తర్వాత  నేను తనకు  చంటిబిడ్డగా మారిపోయానని  ఆమె అభిప్రాయపడ్డారు.

తన కన్నబిడ్డలతో పోలిస్తే  నా గురించే నమ్రత ఎక్కువ టెన్షన్ పడుతుందని  అక్క నాపై  అంత  ప్రేమ  చూపిస్తుందని శిల్ప శిరోద్కర్  పేర్కొన్నారు. శిల్ప శిరోద్కర్ వెల్లడించిన  విషయాలు  సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. మహేష్ రాజమౌళి కాంబో మూవీపై అంచనాలు అంతకంతకు పెరుగుతుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో  చూడాల్సి ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు రేంజ్ మాత్రం అంతకంతకూ  పెరుగుతుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: