మొదటినుంచి "హరిహర వీరమల్లు" సినిమాపై కావాలనే ఒక బ్యాచ్ నెగిటివ్ టాక్ ప్రచారం చేస్తున్న విషయం అందరికీ తెలుసు.  సరిగ్గా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యే 24 గంటల ముందు బాయ్ కాట్ హరిహర వీరమల్లు అంటూ సోషల్ మీడియాలో హ్య్స్ష్ ట్యాగ్స్ ట్రెండ్ చేశారు . కానీ ఎవరు కూడా పవన్ కళ్యాణ్ ని ఏం పీకలేకపోయారు . ఆయన పని ఆయన చేసుకుంటూ పోయారు.  హరిహర వీరమల్లు సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది . తెలుగు అభిమానులనే కాదు హిందీ అభిమానులను కూడా బాగా ఆకట్టుకునింది .


హిందీలో కూడా హరి హర విరమల్లు సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది . ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్ మీద ఉన్నారు . పవన్ కళ్యాణ్ సినిమాను ఒక్కసారి కాదు మూడు నాలుగు సార్లు చూసి సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు . అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై రివేంజ్  తీర్చుకోవడానికి కొన్నిచోట్ల హరిహర వీరమల్లు సినిమా పోస్టర్స్ ను తీసేస్తున్నారు . దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . హరిహర వీరమల్లు సినిమా హిట్ టాక్ రావడం జనాలు హ్యాపీగా ఉండటం చూసి ఓర్వలేని కొంతమంది "హరిహర వీరమల్లు"  సినిమా కోసం పెట్టిన భారీ భారీ కటౌట్లను ఫ్లెక్సీలను రెండవ రోజు తీసేస్తున్నారు .



సోషల్ మీడియాలో రెండవ రోజు హరిహర వీరమల్లు బ్యానర్స్ ని ఎత్తివేస్తున్న ఫొటోస్ వీడియోస్ హల్చల్ చేస్తున్నాయి . దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు . పవన్ కళ్యాణ్  ని ..ఆయన ఫ్యాన్స్ ని ఏం చేయలేకపోతున్నారు అని సినిమా సూపర్ డూపర్ హిట్ చేసేసారు అని.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని బాధ పెట్టడానికి ఈ విధంగా హరిహర వీరమల్లు పోస్టర్ లు తీసేస్తున్నారు అంటూ ఘాటుగా ఆన్సర్ ఇస్తున్నారు.  కొంత మంది మాత్రం చాలా కూల్ గా ఆన్సర్ ఇస్తున్నారు . ఎవరు ఏం చేసినా సినిమా సూపర్ డూపర్ హిట్.. పవన్ కళ్యాణ్ ని ఎవరు ఏం పీకలేరు అంటూ ఓపెన్ గానే సవాల్ విసురుతున్నారు.  కాగా ఈ సినిమా టాక్ అంతా బాగున్న మూవీలో వి ఎఫ్ ఎక్స్ సీన్లు చాలా పేలవంగా ఉన్నాయి అంటూ ఫ్యాన్స్ కూడా మండిపడ్డారు.  దీంతో ఆ సీన్స్ కట్ చేసే పనిలో హరిహర వీరవల్లు టీం బిజీ బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: