టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటులలో సుమంత్ ఒకరు. ఈయన చాలా సంవత్సరాల క్రితమే నటుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. నటుడిగా కెరియర్ను మొదలు పెట్టిన కొత్తలో ఈయన మంచి విజయాలను అందుకుంటు వెళ్ళాడు. దానితో ఈయనకు నటుడిగా మంచి క్రైజ్ వచ్చింది. కానీ ఆ తర్వాత కాలంలో ఈయన నటించిన సినిమాలు వరుస పెట్టి బోల్తా కొడుతూ రావడంతో ఈయన క్రేజ్ చాలా వరకు పడిపోయింది. అలా అనేక అపజయాలను  ఎదుర్కొని అత్యంత లో లో కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే సుమంత్ "మళ్లీ రావా" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో సుమంత్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే మళ్లీ రావా సినిమాలో హీరోగా మొదట గౌతమ్, సుమంత్ ను అనుకోలేదట. ఒక హీరోకు కథని చెప్పి, ఆయన దానిని రిజక్ట్ చేశాక సుమంత్ ను ఈ సినిమా కోసం ఆయన అప్రోచ్ అయ్యాడట. ఈ విషయాన్ని తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. అసలు విషయం లోకి వెళితే... గౌతమ్ తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా కింగ్డమ్ అనే సినిమాను రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని జూలై 31 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా గౌతమ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా గౌతమ్ మాట్లాడుతూ... నేను దర్శకత్వం వహించిన మళ్లీ రావా  సినిమాను మొదట విజయ్ దేవరకొండ తో చేయాలి అనుకున్నాను.

అందులో భాగంగా ఆయనకు కథను కూడా వినిపించాను. కానీ ఆయన మాత్రం ఆ స్టోరీలో హీరోగా నటించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. దానితో నేను సుమంత్ గారిని కలిసి ఆ మూవీ కథను వినిపించాను. ఆయనకు ఆ కథ బాగా నచ్చడంతో ఆ సినిమాలో నటించాడు అని ఆయన చెప్పుకొచ్చాడు. ఇలా గౌతమ్ "మళ్ళీ రావా" సినిమాలో మొదట విజయ్ దేవరకొండ ను అనుకున్నట్లు చెప్పడంతో చాలా మంది అనవసరంగా విజయ్ దేవరకొండ మంచి సినిమాను మిస్ చేసుకున్నాడు అని అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: