- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా బాక్సాఫీస్ వద్ద శుక్రవారం దుమ్ము రేపింది. పవన్ కెరీర్‌లోనే ఎవర్ బిగెస్ట్ డే 1 కలెక్షన్లు నమోదయ్యాయి. ఫ్యాన్స్ ఎగబడి టికెట్లు కొంటూ థియేటర్ల వద్ద సందడి చేసిన వైనం కనిపించింది. పలు ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు వేలాడేలా సినిమాకు భారీ ఓపెనింగ్ దక్కింది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్, మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద క‌ళ్లు చెదిరే క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టింది. అయితే ఈ జోష్ రెండో రోజు మాత్రం కొనసాగలేదు. శనివారం థియేటర్లలో ఆక్యుపెన్సీ గణనీయంగా తగ్గింది. ఉదయం షోలు నుంచి బుకింగ్స్ డీలా పడటం కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో వర్షాల ప్రభావం సినిమా వసూళ్లపై తీవ్రంగా పడింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురవడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రాలేదు. ఇది కూడా శ‌నివారం వ‌సూళ్ల త‌గ్గుద‌ల‌కు కార‌ణ‌మైంది.


దీంతో రెండో రోజు కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లభించలేదు. ఈ తరహాలో రెండో రోజు గ్రాఫ్ పడిపోవడం మేకర్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే వీకెండ్ డేస్ అయిన శ‌ని, ఆదివారాల్లో సినిమా పుంజుకుంటుంద‌న్న ఆశాభావం ట్రేడ్ వ‌ర్గాల్లో క‌నిపిస్తోంది. మౌత్ పబ్లిసిటీ, ఫ్యాన్ బేస్, పవన్ కళ్యాణ్ క్రేజ్, జ‌న‌సేన మూమెంట్ అన్నీ కలిసి పనిచేస్తే, ఈ వీకెండ్ సినిమాకు బ్రేక్ ఇచ్చే అవకాశాలు వున్నాయి. ఫైన‌ల్గా 'హరిహర వీరమల్లు' గ్రాండ్ ఓపెనింగ్‌తో హై నోట్‌లో స్టార్ట్ అయినా, దానిని నిలబెట్టుకోవడం కోసం వీకెండ్ టర్నింగ్ పాయింట్‌గా మారనుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: