పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్గా తాజాగా హరిహర వీరమల్లు అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా ... అత్యంత భారీ బడ్జెట్ ఈ మూవీ ని ఏ ఎం రక్తం నిర్మించాడు. ఈ సినిమా చాలా కాలం క్రితం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభం అయింది. ఆ తర్వాత అనేక సార్లు ఈ సినిమా షూటింగ్ ఆగి పోయి మళ్ళీ ప్రారంభం అయింది. ఇలా అనేక సార్లు జరగడంతో క్రిష్ ఈ మూవీ దర్శకత్వ భాద్యతల నుండి తప్పుకున్నాడు. దానితో ఏ ఏం రత్నం కుమారుడు అయినటువంటి జ్యోతి కృష్ణ ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన షూటింగ్ను పూర్తి చేశాడు. ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదల అయింది.

మూవీ కి విడుదల అయిన మొదటి రోజు , మొదటి షో కే పాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి భారీ ఓపెనింగ్స్ వచ్చిన రెండవ రోజు కాస్త ఈ సినిమాకు కలెక్షన్లు తగ్గాయి. తాజాగా ఈ మూవీ దర్శకుడు అయినటువంటి జ్యోతి కృష్ణ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా క్రిష్ రాసుకున్న కథలో ఎలాంటి మార్పులు ఆయన చేశాడు అనేది ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు. తాజాగా జ్యోతి కృష్ణ మాట్లాడుతూ ... పవన్ కళ్యాణ్ హీరో గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో సినిమా ప్రారంభం అయిన సమయానికి క్రిష్ గారు ఆ సినిమాను కేవలం కోహినూర్ డైమండ్ చుట్టూ తిరిగే కథగా  మాత్రమే రాసుకున్నారు. అలాగే సినిమా నడవాలి అని ఆయన స్క్రీన్ ప్లే కూడా రాసుకున్నారు.

ఆయన బయటకు వచ్చాక నాకు కోహినూర్ డైమండ్ తో  పాటు మరికొన్ని సీన్స్ యాడ్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. అలాగే సనాతన ధర్మ గురించి సన్నివేశాలు రూపొందిస్తే సినిమా ఇంకా అద్భుతంగా వస్తుంది అని ఉద్దేశంతో కథలో కొన్ని మార్పులు , చేర్పులు చేసి ఆ మూవీ ని రూపొందించాను అని ఆయన ఆయన తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే హరిహర వీరమల్లు సినిమా టోటల్ బాక్సా ఫీస్ రను కంప్లీట్ అయ్యే సరికి ఎలాంటి కలెక్షన్లను వసులు చేసి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: