అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో మృనాల్ ఠాకూర్ ఒకరు. ఈమె కెరియర్ ప్రారంభంలో హిందీ సీరియల్స్ లలో నటించి బుల్లి తెర అభిమానుల మనసు దోచుకుంది. ఆ తర్వాత హిందీ సినిమాలలో అవకాశాలను దక్కించుకుంది. ఈమెకు షాహిద్ కపూర్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన తెలుగు జెర్సీ మూవీ రీమేక్ అయినటువంటి హిందీ జెర్సీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయినా ఇందులో మృనాల్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు హీరోయిన్గా మంచి గుర్తింపు వచ్చింది.

ఇది ఇలా ఉంటే ఈమె దుల్కర్ సల్మాన్ హీరో గా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సీత రామం అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం అందుకోవడం, ఈ సినిమాలో ఈమె తన నటనతో ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వచ్చింది. ఆ తర్వాత ఈ బ్యూటీ తెలుగులో హాయ్ నాన్న అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

అందులో భాగంగా పెళ్లి గురించి ఓపెన్ అయ్యింది. తాజా ఇంటర్వ్యూలో భాగంగా మృనాల్ పెళ్లి గురించి మాట్లాడుతూ  ... తనకు త్వరగా అమ్మ కావాలి అని ఉన్నట్లు , అలాగే పిల్లలతో ఎంతో ఆనందంగా జాలీగా గడపాలని ఉన్నట్లు చెప్పుకొచ్చింది. పెళ్లి , పిల్లలు , ఒక ఆనందమైన జీవితం కావాలి అని మృణాల్ చెప్పుకొచ్చింది. కానీ పెళ్లికి మాత్రం ఇంకాస్త సమయం పడుతుంది అని , ప్రస్తుతం కెరియర్ పై ఫోకస్ పెట్టినట్లు , ఆ తర్వాత పెళ్లి చేసుకోనున్నట్లు మృణాల్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: