
అయితే అభిమానులు మాత్రం రాధిక ఆసుపత్రిపాలైందనే విషయం తెలియగానే ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా ఈమె ఇలాగే హాస్పిటల్లో చేరింది. అయితే అప్పుడు ఏదో సర్జరీ జరిగినట్లుగా ఆలస్యంగా తెలిపారు. కాని ఇప్పుడు మరొకసారి ఈ వార్త వినిగానే అటు సిని ప్రముఖులు, అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలిసి త్వరగా రాధిక కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు అభిమానులు. సోషల్ మీడియా వేదికగా అందుకు సంబంధించి ఒక హ్యాష్ ట్యాగ్ ను కూడా ట్రెండ్ చేస్తున్నారు. రాధిక తెలుగులోనే కాకుండా కన్నడ ,తమిళ్ వంటి చిత్రాలలో ఎన్నో వందలాది చిత్రాలలో నటించింది. చాలామంది తెలుగు హీరోలతో కూడా ఎన్నో చిత్రాలలో నటించింది.
ఈమధ్య తల్లిగా, అక్కగా, అమ్మగా ఎన్నో పాత్రలలో నటిస్తోంది రాధిక. అలాగే బుల్లితెరపై కొన్ని టీవీ సీరియల్లో కూడా కనిపిస్తోంది. నిర్మాతగా కూడా పలు చిత్రాలకు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అలాగే పొలిటికల్ పరంగా కూడా రాధిక తనదైన ముద్ర వేసుకున్నారని సమాచారం. ప్రస్తుతం అడపా దడపా సినిమాల్లో నటిస్తూ పలు రకాలు టీవీ ప్రోగ్రాంలలో కనిపిస్తూ సందడి చేస్తున్న రాధిక ఒక్కసారిగా ఇలా ఆసుపత్రిలో చేరడంతో ఆశ్చర్యపోతున్నారు. మరి రాధిక అభిమానుల కోసం స్పందిస్తుందేమో చూడాలి.