
ఎనిమిది రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 18.73 కోట్ల కలెక్షన్ దక్కగా , సీడెడ్ లో 7.98 కోట్లు , ఉత్తరాంధ్రలో 7.54 కోట్లు , ఈస్ట్ లో 5.50 కోట్లు , వెస్ట్ లో 4.45 కోట్లు , గుంటూరులో 5.44 కోట్లు , కృష్ణ లో 4.75 కోట్లు , నెల్లూరులో 1.97 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఎనిమిది రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 56. 36 కోట్ల షేర్ ... 82.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఎనిమిది రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 5 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 6.30 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఎనిమిది రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 67.66 కోట్ల షేర్ ... 110.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమా మొత్తంగా 127.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ సినిమా మరో 59.84 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది. మరి ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత క్రిష్ ఈ మూవీ నుండి తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ అనే దర్శకుడు ఈ మూవీ కి సంబంధించిన మిగిలిన భాగం షూటింగ్ను పూర్తి చేశాడు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన మూవీ ని ఏ ఏం రత్నం నిర్మించాడు.