తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అద్భుతమైన గుర్తింపును , మంచి విజయాన్ని దక్కించుకున్న బ్యూటీలలో సంయుక్తా మీనన్ ఒకరు. ఈ నటిమని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుపాటి రానా హీరోలుగా రూపొందిన భీమ్లా నాయక్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో ఈమె రానాకి  భార్య పాత్రలో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో , ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఆ తర్వాత ఈమె ఎన్నో తెలుగు సినిమాలలో నటించి చాలా విజయాలను  అందుకుంది. ప్రస్తుతం కూడా ఈమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ బ్యూటీ నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభు అనే  సినిమాలో హీరోగా నటిస్తోంది. అలాగే విజయ్ సేతుపతి , పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందుతున్న సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఇక బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న అఖండ 2 మూవీ లో కూడా ఈమె నటిస్తోంది. ఇలా ఈమె చేతిలో ప్రస్తుతం అనేక క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఇలాంటి దశలోనే ఈమె మరో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి , బాబి కొల్లి దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మూవీ ని కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ వారు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ఇప్పటికే బాబీ మొదలు పెట్టినట్లు , అందులో భాగంగా ఈ సినిమాలో చిరంజీవి కి జోడిగా సంయుక్త మీనన్ ను ఓకే చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త కనుక నిజం అయితే సంయుక్త కి అదిరిపోయే రేంజ్ క్రేజీ సినిమాలో అవకాశం దక్కినట్లే అని చాలా మంది భావిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నట్లు కూడా ఓ వార్త సూపర్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: