మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మాస్ జాతర అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని ఆగస్టు 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించిన తర్వాత ఈ సినిమా షూటింగ్ డిలే అవుతూ వస్తుంది. దానితో ఈ సినిమా ఆగస్టు 27 వ తేదీన విడుదల కాపడం కష్టం అనే ఓ వార్త వైరల్ అయింది. దానితో రవితేజ అభిమానులు కాస్త కంగారు పట్టారు. కానీ ఈ సినిమా ఆగస్టు 27 వ తేదీన విడుదల అయ్యే అవకాశాలు పక్కాగా కనపడుతూ ఉండడంతో ఆయన అభిమానులు ప్రస్తుతం ఆనంద పడుతున్నారు.

ఇకపోతే ఓ విషయంలో మాత్రం రవితేజ అభిమానులు ఓ వైపు ఆనంద పడుతున్నా మరో వైపు డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది. అది ఇందులో అనుకుంటున్నారా ..? అసలు విషయం లోకి వెళితే ... ఈ మధ్య కాలంలో ఏ మూవీ యూనిట్స్ అయినా కూడా ఏదైనా సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కంటెంట్ విడుదల చేయాలి అన్న అందుకోసం ప్రత్యేకంగా ఈవెంట్లను ఏర్పాటు చేసి ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేస్తూ వస్తున్నారు. తాజాగా మాస్ జాతర సినిమా టీజర్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఈ మూవీ టీజర్ ను ఈ రోజు ఉదయం 11 గంటల 08 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

దానితో రవితేజ అభిమానులు చాలా  ఖుషి అయ్యారు. కాకపోతే ఈ సినిమా టీజర్ విడుదలను నేరుగా యూట్యూబ్లో విడుదల చేయనున్నట్లు , దాని కోసం ప్రత్యేకంగా ఏ ఈవెంట్ను ఏర్పాటు చేసే ఆలోచనలో మేకర్స్ లేనట్లు తెలుస్తోంది. దానితో మూవీ కి ఎంతో కీలకమైన టీజర్ ను విడుదల చేసే సందర్భంలో ఒక ఈవెంట్ ను ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది , దాని ద్వారా సినిమాపై మరింత మైలేజ్ ఏర్పడేది అని రవితేజ అభిమానులు అనుకుంటున్నట్లు , ఈ మూవీ టీజర్ విడుదల కోసం ఈవెంట్లను ఏర్పాటు చేయనందుకు వారు కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rt