
జూనియర్ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం చాలా చాలా గ్రాండ్ గా హైదరాబాద్లో జరిగింది . ఈవెంట్ సూపర్ సక్సెస్ అయ్యింది. అయితే ఈ ఈవెంట్లో రేవంత్ రెడ్డికి అదే విధంగా పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలపడం మర్చిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ . వెంటనే తడుముకొని ఒక పర్సనల్ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు . "తప్పైపోయింది క్షమించండి ..25 ఏళ్ల నా కెరియర్ ని గుర్తు చేసుకొని ఆనందంలో మర్చిపోయాను " అంటూ ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు .
ఇది ఒక నెగిటివ్ పాయింట్ గా మారిపోయింది . అయితే ఎన్టీఆర్ స్పీచ్ ఇస్తున్న మధ్యలో ఫ్యాన్స్ హంగామా చేయడంతో ఒక్కసారిగా ఎన్టీఆర్ కోపానికి గురై "వెళ్లిపోనా ఇక్కడి నుంచి వెళ్లిపోనా..?" అంటూ కొంచెం గట్టిగానే అరిచారు.అభిమానులపై సీరియస్ అయ్యారు. అభిమానులకు వార్నింగ్ కూడా ఇచ్చారు . అరుపులు ఆపండి నన్ను మాట్లాడనివ్వండి అంటూ హెచ్చరించారు. నిజానికి ఈ తరహా బిహేవియర్ తారక్ నుంచి ఎప్పుడు చూడలేదు . దీంతో ఒక్కసారిగా తారక్ పై నెగిటివిటీ క్రియేట్ అయిపోయింది . అయితే ఇదే మూమెంట్లో రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా అలెర్ట్ అయ్యారు .
రాంచరణ్ వ్యక్తిత్వాన్ని తెలియజేసే ఒక వీడియోని షేర్ చేసి ఎన్టీఆర్ పరువు తీసేస్తున్నారు . గతంలో ఓ ఈవెంట్లో అచ్చం ఇలాగే అభిమానులు రామ్ చరణ్ ని విసిగిస్తారు. కానీ రామ్ చరణ్ మాత్రం ఫ్లయింగ్ కిస్ ఇచ్చి స్మూత్ గా స్పీచ్ ని క్లోజ్ చేసేసారు . కానీ ఎన్టీఆర్ మాత్రం చాలా సీరియస్ అయిపోతూ వార్నింగ్ ఇచ్చారు . వీళ్ళిద్దరికీ ఇదే తేడా. " ఇప్పుడు చెప్పండి ఎవరు గ్లోబల్ స్టార్ ..? ఎవరు నెంబర్ వన్ స్టార్ ..?" అనేది అంటూ ఫ్యాన్స్ ఘాటుఘాటుగా ట్రెండ్ చేస్తున్నారు . రామ్ చరణ్ ఫ్యాన్స్ చరణ్ గొప్ప అంటుంటే నందమూరి ఫ్యాన్స్ మా తారక్ గొప్ప అంటూ పొగిడేసుకుంటున్నారు .
పొగడ్తలో కాదు హద్దులు మీరి పోయి ఒక హీరోని మరొక హీరో ఫ్యాన్స్ బూతులు కూడా తిట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇది బాగా హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. నిన్న మొన్నటి వరకు రామ్ చరణ్ - అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొట్టుకొని చచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఫ్యాన్స్ లైన్లోకి వచ్చారు. ఇద్దరి ఫ్యాన్స్ మధ్య వార్ కూల్ అవ్వాలి అంటే ఇద్దరు స్టార్ హీరోలు స్పందించాల్సిందే అంటున్నారు సినీ ప్రముఖులు..!