గత కొంత కాలంగా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన సినీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ సమ్మె విరమణ దిశగా అడుగులు పడుతున్నట్లు తాజా సమీకరణాలు కనబడుతున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... తెలంగాణ సినిమాటో గ్రఫీ మంత్రి గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహరిస్తున్న విషయం మనకి తెలిసిందే. ఈయన ప్రస్తుతం దిల్ రాజు మరియు ఫెడరేషన్ వారితో సమావేశం జరపనున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా తెలంగాణ సినిమాటో గ్రఫీ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినీ కార్మికులతో చర్చలు జరపనున్నట్లు , అందులో భాగంగా వారిని కొంత వరకు తగ్గే విధంగా సూచనలు చేయనున్నట్లు , అలాగే సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన నిర్మాతలు కూడా వారికి పెంచుతానన్న దాని కంటే కూడా కాస్త ఎక్కువగా పెంచే విధంగా సూచనలు చేయనున్నట్లు , ఇలా ఇరు వైపుల కొన్ని తగ్గింపులు , పెంచులు చేసే విధంగా ఆయన చర్చలు నిర్వహించనున్నట్లు , దాదాపుగా సఫలం అయినట్ల అయితే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన సినీ కార్మికుల సమ్మె విరమణ అయ్యే అవకాశాలు ఉన్నట్లు చాలా మంది భావిస్తున్నారు.

ఏదేమైనా కూడా ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో సినీ కార్మికుల సమ్మె అనేది పెద్ద విషయంగా మారింది. మరి ఈ సమ్మె అనేది విరమణ జరిగినట్లయితే నిర్మాతలకు పెద్ద ఊరట కలుగుతుంది. మరి తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇరు వర్గాల వారితో చేసే చర్చలు సఫలం అవుతాయా ..? తెలుగు సినీ కార్మికుల సమ్మె విరమణ జరుగుతుందా ..? అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాలి. ఏదేమైనా కూడా ఓ వైపు సినీ కార్మికుల సమస్య , మరో వైపు నిర్మాతల సమస్యను కూడా ఒకే విధంగా చక్క బెట్టడం కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: