సాధారణంగా కాంట్రవర్షియల్ వ్యక్తుల నుండి..అలాగే కాంట్రవర్షియల్ అవుతుంది అనుకునే టాపిక్స్ నుండి దూరంగా ఉంటారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . అందరికీ బాగా బాగా సుపరిచితుడు. ముఖ్యంగా అందరితో కలివిడిగా మెలుగుతారు. కోలీవుడ్‌లో ఎంతటి మార్కెటింగ్ ఉందో.. ఆయన సినిమాలకు తెలుగులో కూడా అంతే హై మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు అని చెప్పుకోవడం లో సందేహమే లేదు. ఆయన చివరిగా నటించిన కంగువా, రెట్రో  సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి.
 

ఈ నేపథ్యంలో, తన తదుపరి సినిమా ఎలాగైనా హిట్ కావాలనే ఉద్దేశంతో, తమిళ్ స్టార్ హీరో సూర్య తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి కి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటికే ఈ చిత్రం అధికారికంగా ప్రారంభమై, షూట్‌ వేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ తృప్తి డిమ్రీని ఎంపిక చేసినట్లు కోలీవుడ్ - టాలీవుడ్ మీడియా లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్‌గా మలయాళీ ముద్దుగుమ్మ మమిత బైజు ఎంపికయ్యారు. ఇప్పుడు రెండో హీరోయిన్‌గా తృప్తి డిమ్రీని ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి.



ఒకవేళ ఇది నిజమైతే, సూర్య సినిమాకి కావాల్సినంత కాంట్రవర్షియాలిటి వచ్చేస్తుందని అంటున్నారు సినీ ప్రముఖులు. ఈ మధ్య కాలంలో తృప్తి వివిధ కారణాలతో వార్తల్లో నిలిచిన విషయం అందరికి తెలిసిందే. ముఖ్యంగా అనిమల్ సినిమాలో బోల్డ్ సీన్స్, అలాగే స్పిరిట్ సినిమాలో దీపికా పదుకొనే పాత్రను దక్కించుకోవడం వల్ల కౌంట్రవర్సీలు ఎక్కువ అయ్యాయి. ఇప్పుడు సూర్య సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. దీంతో సూర్య సినిమాకు ఒక పక్క పబ్లిసిటీ, మరో పక్క కాంట్రవర్షీ — రెండూ సమాంతరంగా వస్తున్నాయని సినీ వర్గాల మాట. ఇక తృప్తి ఈ సినిమాతో ఎలాంటి పేరు తెచ్చుకుంటుందో చూడాలి..!?

మరింత సమాచారం తెలుసుకోండి: