
వార్-2 మూవీ ప్లస్ లు :
వార్-2 మూవీ ఓవర్సీస్ టాక్ పరంగా చూస్తే హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ఇద్దరూ చాలా పోటాపోటీగా నటించారు. వీరిద్దరి నటన సినిమాకి పెద్ద ప్లస్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమాలో గ్లామర్ డాల్ గా కియారా అద్వానిని చెప్పుకోవచ్చు.కియారా అద్వానీ గ్లామర్,నటన సినిమాకి ప్లస్ అయ్యాయి. అలాగే రెండు ఇండస్ట్రీల నుండి దిగ్గజ హీరోలను వార్ -2 మూవీలో పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అటు నార్త్ ఇటు సౌత్ నుండి వీరి క్రేజ్ కి కలెక్షన్స్ భారీగానే వస్తాయి. వీరి క్రేజ్ సినిమాకి ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఎన్టీఆర్ ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పిస్తాయి అంటూ ఎన్టీఆర్ అభిమానులు పోస్టులు చేస్తున్నారు.
వార్-2 మూవీ మైనస్లు:
అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ సినిమా అద్భుతంగా ఉంది అంటున్నారు. కానీ వేరే వాళ్ళు ఈ సినిమా కి అబో యావరేజ్ అనే రివ్యూ ఇస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ భారీ బడ్జెట్ పెట్టిన ఈ సినిమాకి ఇలాంటి బిలో యావరేజ్ రివ్యూలు సినిమాకి కాస్త మైనస్ అయ్యేలా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ప్రీమియర్ షో చూసినవాళ్లు ఈ రివ్యూలు ఇచ్చారు. మరి ఇంకో షో పడితే రివ్యూలు ఏమైనా మారుతాయా అనేది చూడాలి.