
నైజాంలో కూలీ సినిమా సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. . మొదటి రోజే దాదాపు రూ.4.15 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది (జీఎస్టీ మినహాయించి). కూలీతో పోటీగా వచ్చిన వార్ 2 నైజాంలో దాదాపు రూ.4.25 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం .. కూలీతో పోలిస్తే వార్ 2 కాస్త ముందంజలో ఉన్నా, వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ విషయానికి వస్తే వార్ 2 భారీ స్థాయిలో వెనుకబడి ఉంది. రజనీకాంత్ నటించిన కూలీ చిత్రానికి ప్రధాన ప్లస్ పాయింట్స్‌గా అనిరుధ్ ఇచ్చిన సంగీతం, అలాగే లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ అంటున్నారు జనాలు ..
అభిమానులు ఎప్పటి నుంచో రజనీకాంత్‌ను ఇలాంటి లుక్‌లో చూడాలని కోరుకున్నారు. ఫైనల్లీ ఆ కోరికను లోకేష్ కనగరాజ్ నెరవేర్చాడు. అలాగే ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కీలక పాత్రల్లో నటించడం కూడా మరో హైలైట్‌గా మారింది. ప్రస్తుతం ఈ సినిమా సెన్సేషనల్ రికార్డ్స్ దిశగా దూసుకుపోతోంది .. మొత్తానికి, తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్ సాధించిన కూలీ, నైజాం మార్కెట్‌లో కూడా స్ట్రాంగ్ ఓపెనింగ్ అందుకుంది .. చూడాలి మరీ ఈ "కూలీ" సినిమా ఇంకెన్ని సంచలన రికార్డ్స్ నెలకొల్పుతుందో.. .??