
అదే తరహాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన పీక్స్‌లో ఉన్నప్పుడే ఓం రౌత్‌తో కలిసి చేసిన ఆదిపురుష్ కూడా ఘోరమైన ఫెయిల్యూర్‌గా మిగిలింది. తాజాగా ఎన్టీఆర్ కూడా ‘వార్ 2’తో అయాన్ ముఖర్జీని బలంగా నమ్మి ముందుకు వెళితే ఫలితం ఎవ్వరూ ఊహించని షాక్‌గా మారింది. దీంతో టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ డైరెక్టర్లపై పెట్టిన బెట్స్ అన్నీ విఫలమయ్యాయి. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ముందుచూపు ఉన్న ఇద్దరు హీరోలు ఈ జోలికి అస్సలు పోలేదు. వారు సూపర్‌స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మహేష్ బాబు ఇప్పటివరకు ఒక్కసారి కూడా హిందీ డైరెక్టర్‌తో సినిమా చేయలేదు. దక్షిణాది డైరెక్టర్లే తనను ఎక్కడికో తీసుకెళ్తారని ఆయన నమ్మకం. అల్లు అర్జున్ అయితే ఇంకో అడుగు ముందే. వేరే భాషా డైరెక్టర్‌తో ఒక్క సినిమా కూడా చేయలేదు. ముంబై డైరెక్టర్ల స్క్రిప్టులు విన్నప్పటికీ, వారిని నమ్మి ముందడుగు వేయలేదు.
ఇప్పుడు చూస్తే అదే స్ట్రాంగ్ డెసిషన్‌గా మారింది. ఎందుకంటే రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్‌లు బలమైన ఇమేజ్ ఉన్నప్పటికీ బాలీవుడ్ డైరెక్టర్లపై పెట్టిన నమ్మకమే వారిని ఒకడుగు వెనక్కి నెట్టింది. కానీ మహేష్, బన్నీ మాత్రం “సౌత్ ఈజ్ బెస్ట్” అనే ఫార్ములాతో తమ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. నేటి రోజుల్లో సౌత్ సినిమాలకు ఉన్న క్రేజ్ చూస్తే, వారి నిర్ణయం ఎంత బలమైందో అర్థమవుతోంది. ఇక బన్నీ తొలిసారి అట్లీతో చేయబోయే సినిమా మాత్రం మినహాయింపు. దానికీ ఆయన ఓకే చెప్పడానికి ప్రధాన కారణం అట్లీ సౌత్‌లోనే తన టాలెంట్ నిరూపించుకోవడమే. మొత్తానికి మిగతా స్టార్‌లు హిందీ వైపు చూసి ఎదురు దెబ్బలు తింటే, మహేష్ – బన్నీ మాత్రం “మనదే మార్కెట్… మనదే రూట్” అని చూపించిన సత్తా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.