వార్ 2 యావ‌రేజ్ టాక్‌ ఎఫెక్ట్ అటు తిరిగి ఇటు తిరిగి నిర్మాత నాగ‌వంశీపై ప‌డింది. వార్ 2కి ఆయ‌న నిర్మాత కాక‌పోయినా ఇప్పుడు ఆయ‌న‌పై ఎక్కువ ట్రోలింగ్ న‌డుస్తోంది. ఆయ‌న తెలుగులో ఈ సినిమా రైట్స్ కొని రిలీజ్ చేశారు. ఈ సినిమా ఏపీ, తెలంగాణ రైట్స్ కోసం ఆయ‌న ఏకంగా రు. 90 కోట్లు పెట్టారు. సినిమాకు ఇప్పుడు మిక్స్ డ్ టాక్ న‌డుస్తోంది. లాంగ్ ర‌న్ లో రు. 60 కోట్ల‌కు మించి షేర్ రాదంటున్నారు. అంటే ఎలా లేద‌న్నా నాగ‌వంశీకి న‌ష్టం త‌ప్ప‌దు. నాగ‌వంశీ సినిమా చూడ‌లేదు.. ఎన్టీఆర్ మీద ప్రేమ‌తో అంత పోసి కొనేశారు. పైగా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో నాగ‌వంశీ చాలా కాన్ఫిడెంట్‌గా స్పీచ్ ఇచ్చారు. బాలీవుడ్ కంటే ఒక్క రూపాయి అయినా తెలుగు వాళ్లు ఎక్కువ ఇవ్వాల‌ని కోరారు.


ఇదిలా ఉంటే నాగ‌వంశీ చాలా స్పీడ్‌గా భారీ కాంబినేష‌న్లు సెట్ చేసుకుంటూ భారీ బ‌డ్జెట్ సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్లో నాగ‌వంశీ పేరే బాగా హైలెట్ అవుతోంది. దిల్ రాజు లాంటి వాళ్లు రేసులో వెన‌క‌ప‌డిపోయారు. మైత్రీ, నాగ‌వంశీయే క్రేజీ ప్రాజెక్టులు సెట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు నాగ‌వంశీ జ‌డ్జ్‌మెంట్ కూడా రాంగ్ అవుతోందా ? అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. కింగ్‌డ‌మ్ అంచ‌నాలు అందుకోలేదు. వార్ 2 ఎంతో ఆశ‌తో కొని రిలీజ్ చేసినా తేడా కొట్టేసింది. ఇక ర‌వితేజ‌తో తీస్తోన్న మాస్ జాత‌ర సినిమా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ అయిన కంటెంట్ చూసి ఆ సినిమా కూడా క‌ష్ట‌మే అంటున్నారు.


పైగా మాస్ జాత‌ర రిలీజ్ డేట్ కూడా వాయిదా ప‌డుతుంద‌న్న వార్త‌లు చూస్తుంటే నాగ‌వంశీ జ‌డ్జ్‌మెంట్ విష‌యంలో ఎంత‌లా జాగ్ర‌త్త ప‌డాలో చెపుతోంది. ఇక‌పై నాగ‌వంశీ స్టార్ కాస్ట్ కాకుండా.. కాంబినేష‌న్లు న‌మ్ముకోకుండా.. క‌థ‌ను న‌మ్ముకోవాల‌న్న చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: