
ఇక తాజా బజ్ ప్రకారం ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ కోసం ప్రశాంత్ నీల్ కొత్త ఐడియా డిజైన్ చేశారట. హిందీ వెర్షన్ కోసం ఒక బాలీవుడ్ స్టార్ హీరోని, తమిళ్ వెర్షన్ కోసం ఒక కోలీవుడ్ స్టార్ హీరోని తీసుకోవాలని నిర్ణయించారని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళ్ ఇండస్ట్రీలో ఈ పాత్ర కోసం చాలా మంది స్టార్ హీరోలను అప్రోచ్ అయినప్పటికీ, చివరకు ఒక టాప్ హీరో మాత్రమే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడానికి ఒప్పుకున్నారట. ఆయనే ప్రస్తుతం తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత టాప్‌లో ఉన్న హీరో అని టాక్. ఈ ఇద్దరి పేర్లను త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారని సినీ వర్గాల్లో టాక్ బలంగా వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా, ఈ చిత్రానికి "డ్రాగన్" అనే టైటిల్ దాదాపు ఫైనల్ అయ్యిందని, కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇటీవల "వార్ 2 డిజాస్టర్" వల్ల ఎలాంటి నిరుత్సాహం చెందకుండా, తన కెరీర్‌లో మరో మాసివ్ బ్లాక్‌బస్టర్ ఇవ్వాలని జూనియర్ ఎన్టీఆర్ పూర్తి దృష్టి పెట్టారని సమాచారం. ప్రశాంత్ నీల్ ప్లానింగ్ ఎప్పుడూ వేరే స్థాయిలోనే ఉంటుంది. ఏ ఇండస్ట్రీ నుండి అయినా అగ్రస్థాయి నటులను తీసుకోవడంలో ఆయనకు ప్రత్యేక స్ట్రాటజీ ఉంటుంది. అలాంటి ప్లానింగ్ వల్లే ఈ సినిమాకు భారీ హైప్ ఏర్పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అభిమానులంతా ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. సినీ ప్రముఖులు కూడా "డ్రాగన్" సినిమానే వచ్చే రోజుల్లో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త మైలురాయిగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. చూద్దాం మరి, జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మోస్ట్ అవెయిటెడ్ మూవీ డ్రాగన్ ఎలాంటి మాయ చేస్తుందో!