సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒక నమ్మకం ఉంది. ఎవరైన హీరోయిన్ టాప్ రేంజ్ హీరోలతో కలిసి నటిస్తే తప్పకుండా ఆమె కెరీర్ హైలైట్ అవుతుంది. మరిన్ని ఆఫర్స్ వరుసగా వస్తాయి అని. కానీ వాస్తవం ఎల్లప్పుడూ అలానే ఉండదు. చాలా మంది హీరోయిన్స్ అనుభవాలే ఆ నమ్మకాన్ని తప్పు అని నిరూపించాయి. అలాంటి స్పష్టమైన ఉదాహరణల్లో ఒకటి "మనీషా కొయిరాలా". ఈ నేపాలి సుందరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 90లలో బాలీవుడ్ లోనూ, సౌత్ ఇండస్ట్రీలోనూ తన అందంతో, తన నటనతో, తన స్టైల్‌తో కుర్రకారులో అమోఘమైన క్రేజ్ సంపాదించుకుంది. ఆ కాలంలో ఎక్కడ చూసినా మనీషా ఫోటోలు కనిపించేవి. ముఖ్యంగా బ్యాచిలర్ హాస్టల్స్ లో ఆమె పోస్టర్లు తప్పక కనిపించేవి. అంతటి పాపులారిటీని సొంతం చేసుకున్న మనీషా, ఒక దశలో స్టార్ హీరోల సరసన వరుస సినిమాల్లో నటిస్తూ టాప్ హీరోయిన్ లిస్ట్‌లోకి చేరిపోయింది.


అయితే, ఆమె కెరీర్‌ ఊహించని మలుపు తీసుకొచ్చిన సినిమా ‘బాబా’. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమా పై అప్పట్లోనే భారీ అంచనాలు ఉండేటివి. రజనీకాంత్ స్వయంగా రాసుకున్న కథ, ఆధ్యాత్మిక కాన్సెప్ట్ – వీటితో బాబా సినిమా ఒక కల్ట్ బ్లాక్‌బస్టర్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఫలితం మాత్రం పూర్తిగా విరుద్ధంగా వచ్చింది. సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. ఆ పరాజయం ప్రభావం ఎక్కువగా మనీషాపై పడింది. అప్పటివరకు సౌత్‌లో వరుసగా వచ్చిన ఆఫర్స్ ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆమె ఇమేజ్ కూడా బలహీనపడిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా మనీషా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

 

“రజనీకాంత్ సరసన నటించిన "బాబా" సినిమా నా కెరీర్‌లో పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఆ సినిమా ముందు నాకు సౌత్‌లో మంచి ఆఫర్స్ వచ్చేవి. కానీ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఆ అవకాశాలు తగ్గిపోయాయి. తిరిగి ట్రాక్‌లోకి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది” అని ఆమె స్పష్టంగా వెల్లడించింది. ఆమె వ్యాఖ్యలు  పెద్ద దుమారం రేపాయి. రజనీకాంత్ అభిమానులు మనీషాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను విమర్శలతో ఇబ్బంది పెట్టారు కూడా. ఆ తర్వాత రజనీకాంత్ ఇతర హీరోయిన్స్‌తో నటించినా వారికి మంచి బ్రేక్‌లు వచ్చాయి. కాబట్టి బాబా సినిమా ఫెయిల్యూర్‌కి రజనీకాంత్‌ను ఒక్కరినే కారణం చేయడం తగదు అని చాలామంది సినీ ప్రముఖులు కూడా వ్యాఖ్యానించారు. జనాల అభిప్రాయం ప్రకారం – బాబా సినిమా ఫ్లాప్ కావడానికి కథా నిర్మాణం, డైరెక్షన్, స్క్రీన్‌ప్లే వంటి అంశాలు బలహీనంగా ఉండటం కూడా పెద్ద విషయమే. కానీ దాని ప్రభావం హీరోయిన్ మనీషా కెరీర్‌పై పడటం నిజంగా దురదృష్టకరం. ఆమె ఆ సమయంలో ఉన్న ఇమేజ్ ఒక్కసారిగా పడిపోవడం మాత్రం వాస్తవం. మొత్తానికి, స్టార్ హీరోలతో నటించడం ఎల్లప్పుడూ కెరీర్ హైలైట్ అవుతుంది అనే నమ్మకం తప్పని, అందుకు బాబా సినిమామనీషా కొయిరాలా – రజనీకాంత్ ఉదాహరణలుగా నిలిచారు అని ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: