టాలీవుడ్ అందాల భామ, టాలెంటెడ్ నటి లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు వెండితెరపై తన అందం, నటనతో అభిమానులను అలరించిన ఈ భామ ఇప్పుడు మెగా కుటుంబంలో కోడలుగా అందరికీ సుపరిచితురాలు. నటుడు, మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ని ప్రేమించి, అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న లావణ్య పెళ్లి తర్వాత తన వ్యక్తిగత జీవితాన్ని ఆనందంగా గడుపుతుంది. వివాహం తర్వాత కూడా ఆమెకు పలు పెద్ద అవకాశాలు లభించినప్పటికీ, మెగా కుటుంబం ప్రతిష్టకు భంగం కలిగించకుండా, మంచి కాన్సెప్ట్ ఉన్న చిత్రాలను మాత్రమే ఎంచుకుంటూ జాగ్రత్తగా కెరీర్‌ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ‘సతీ లీలావతి’ అనే సినిమాను ప్రకటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రానికి సంబంధించిన పలు పోస్టర్లు, అప్డేట్లు విడుదలైనప్పటికీ, సినిమా విడుదల తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా జరుగుతోంది.


అయితే, ఈ మధ్యకాలంలో లావణ్య త్రిపాఠి ఓ హ్యాపీ న్యూస్ అభిమానులకి చెప్పుకొచ్చింది. ఆమె ప్రెగ్నెంట్ అయిన వార్త తెలిసిన వెంటనే అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఈ కారణంగా ‘సతీ లీలావతి’ చిత్రంలో ఆమె పాత్రకు సంబంధించిన కొంత షూట్ పెండింగ్‌లోకి వెళ్లింది. ఇటీవల వినాయక చవితి సందర్భంగా లావణ్య త్రిపాఠి తన బేబీ బంప్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. సంప్రదాయ దుస్తుల్లో కూర్చుని ఉన్న ఈ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. సహజంగానే కొన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చినా, ఎక్కువ మంది అభిమానులు మాత్రం ఆమె అందాన్ని, ధైర్యాన్ని ప్రశంసించారు.



ఇంతలో లావణ్య అభిమానులను మరోసారి ఆశ్చర్యపరిచే వార్తను షేర్ చేసింది. చాలా మందికి తెలియకుండా ఆమె తన మొదటి తమిళ చిత్రంలో కూడా నటించింది. ఈ విషయాన్ని ఎప్పటివరకు సీక్రెట్‌గా ఉంచిన లావణ్య, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్‌ను ప్రకటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదల కానుందని తెలిపింది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ చిత్రం ట్రైలర్ ఆగస్టు 31న సాయంత్రం 6 గంట 1 నిమిషానికి రిలీజ్ కానుందని కూడా లావణ్య సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ సందర్భంగా “నొప్పి మిమ్మల్ని హీరోగా చేస్తుంది లేదా విలన్‌గా చేస్తుంది” అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది. దీంతో ఆమె తమిళ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారన్న వార్త అభిమానులను ఉత్సాహపరిచింది.



ఈ సినిమాలో అధర్వ మురళి హీరోగా నటిస్తున్నారు. లావణ్య త్రిపాఠి ప్రస్తుతం గర్భవతిగా ఉన్నప్పటికీ, తన చిత్ర ప్రమోషన్లలో  పాల్గొంటుండటం, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపి సినిమా కోసం కష్టపడటం అందరినీ ఆకట్టుకుంటోంది. తమిళ సినీ పరిశ్రమలో లావణ్య తనదైన ప్రత్యేక గుర్తింపును సాధిస్తుందన్న నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: