కోలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన జ్యోతిక.. తెలుగు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇకపోతే గత ఏడాది విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రం షైతాన్. ఇందులో జ్యోతిక, అజయ్ దేవగన్, ఆర్ మాధవన్ నటించారు. డైరెక్టర్ వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సీక్వెల్ ను ఇటీవలే తెరకెక్కించబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది కూడా. అందుకు  సంబంధించి పనులను కూడా మొదలుపెట్టినట్లుగా బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మాధవన్, జ్యోతిక, అజయ్ దేవగన్ ఒక సినిమా ఈవెంట్ కి గెస్ట్లు గా వెళ్లారు. ఇందులో జ్యోతిక మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి.


ముఖ్యంగా బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ షూటింగ్ చేసే విధానాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయానని తెలిపారు. అంతేకాదు  షైతాన్ సినిమా పోస్టర్ ను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ పోస్టర్ చూసి తనకి చాలా ఆనందం కలిగిందని,  ఎందుకంటే ఇప్పటివరకు  అలా ఎవరూ చేయలేదని కూడా వెల్లడించింది.. సౌత్ హీరోలతో తాను కలిసి నటించినప్పటికీ  ఈ పని చేయలేకపోయారని తెలిపింది.. అలాగే రీసెంట్ గా తాను మమ్ముట్టితో కలిసి నటించిన చిత్రం  "కాథల్ ది కోర్" అనే సినిమా పోస్టర్ ను కూడా మమ్ముట్టి గారు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాటిని చూడడం చాలా ఆనందంగా అనిపించిందని తెలిపింది.


అయితే దక్షిణాదిలో ఎంతోమంది స్టార్స్ తో చేసినా వారెవరు కూడా అలా చేయలేదు. వారందరూ కూడా చాలా స్వార్థపరులు అంటూ తెలిపింది. ముఖ్యంగా పోస్టర్లో హీరోయిన్ ఉండటాన్ని పెద్దగా ఇష్టపడరని తెలిపింది. వారు ఎలా వదిలించుకోవాలో అని చూస్తూ ఉంటారు. ఎలాంటి గుర్తింపునివ్వరంటూ తెలిపింది. అజయ్ దేవగన్, మమ్ముట్టి వంటివారే రియల్ స్టార్స్ అంటూ తెలిపింది.. ఇలాంటివారు సినీ ఇండస్ట్రీలో ఉండడం చాలా గ్రేట్ అంటూ.. ఈ విషయం చాలా ఏళ్లుగా గమనించానని తెలిపింది జ్యోతిక. జ్యోతిక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని సృష్టించేలా చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: