రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ అనన్య సామాన్యం అన్న విష‌యంలో ఎవ్వ‌రికి ఎలాంటి సందేహాలు లేవు. ఇటీవ‌లే ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఇక ఈ రోజు తన 54 వ పుట్టినరోజు ఇప్పుడు రాగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ , మెగా ఫ్యామిలీ అభిమానులు ఈ పుట్టినరోజుని ఎంతో స్పెషల్ గా చేసుకుంటున్నారు .. ఇక ఈ పుట్టినరోజుకి ఓజి పై క్రేజీ న్యూస్ ఒకటి వైరల్ గా వినిపిస్తోంది. ప‌వ‌న్ నుంచి త్వ‌ర‌లోనే రిలీజ్ కాబోతోన్న మోస్ట్‌ అవైటెడ్ ఓజి చిత్రం తాలూకా మొదటి నైజాం టికెట్ అక్షరాల 5లక్షల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. అయితే ఈ టికెట్ ని పవన్ కళ్యాణ్ యూఎస్ లో నార్త్ అమెరికా అభిమాన బృందం కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తోంది.


దీంతో ఈ రికార్డ్ ధర ఇప్పుడు తెలుగు సినీ వ‌ర్గాల్లో వైరల్ గా మారింది. ఇక ఈ టికెట్ తాలూకా డబ్బులని అభిమానులు పవన్ పార్టీకి డొనేట్ చేయనున్నారని టాక్ వైరల్ గా మారింది. ఇక ఈ అవైటెడ్ సినిమాసెప్టెంబర్ 25న వ‌రల్డ్ వైడ్ గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న ప్రియాంక అరుళ్ మోహ‌న్ హీరోయిన్ కాగా.. సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు ..


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి .. .

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి. .

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: