
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఒక సందర్భంలో ఆమె మాట్లాడుతూ, కొన్ని బ్రాండెడ్ వెబ్‌సైట్‌లలో తన అనుమతి లేకుండా తన ఫోటోలను ఉపయోగించడం చూసి షాక్ అయినట్లు తెలిపారు.
"నేను ఒక నటిని కాబట్టి, నేను ధరించే కొత్త దుస్తులు, ఆభరణాల గురించి నా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. ఆ సమయంలో సదరు బ్రాండ్‌కు క్రెడిట్ ఇస్తాను. అలా క్రెడిట్ ఇచ్చానంత మాత్రాన నా ఫోటోలను వారి వెబ్‌సైట్‌లలో వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే హక్కు వారికి లేదు. ఇది పూర్తిగా నైతిక బాధ్యతలకు విరుద్ధం. ఇలా చేయడం ఏ మాత్రం సరైనది కాదు" అని సోనాక్షి స్పష్టం చేశారు.
ఆమె ఇంకా మాట్లాడుతూ, "ఒక సెలబ్రిటీ ఫోటోను వారి అనుమతి లేకుండా ఉపయోగించడం చట్టవిరుద్ధం. నేను ఇలాంటి చర్యలు తీసుకునే వెబ్‌సైట్‌ల వివరాలను బయటపెట్టడానికి ముందే, వారు నా ఫోటోలను వెంటనే తొలగించాలని కోరుతున్నాను" అని హెచ్చరించారు.
సోనాక్షి సిన్హా లేవనెత్తిన ఈ అంశం, ఆన్‌లైన్ వ్యాపారంలో నైతిక విలువల గురించి, ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల గురించి తీవ్రమైన చర్చకు దారితీసింది. డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచారం, ఫోటోల వినియోగంపై మరింత స్పష్టమైన నియమాలు, నిబంధనలు అవసరమని ఈ సంఘటన రుజువు చేస్తోంది. సోనాక్షి సిన్హా వయస్సు 38 సంవత్సరాలు కాగా ఈ వయస్సులో కూడా ఆమె వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు