తమిళ నటుడు శివ కార్తికేయన్ తాజాగా ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన మదరాసి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించింది. ఇకపోతే ఈ సినిమాను సెప్టెంబర్ 5 వ తేదీన పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ మూవీ ని సెప్టెంబర్ 5 వ తేదీనే తెలుగు భాషలో కూడా విడుదల చేశారు. తెలుగులో ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడమ విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మిక్స్ డ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద స్థాయి కలెక్షన్లు దక్కడం లేదు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 4  రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 1.05 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 34 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 1.06 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 4 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.45 కోట్ల షేర్ ... 4.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి మిక్స్ డ్ టాక్ రావడంతో మొదటి రోజు నుండి ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద స్థాయి కలెక్షన్లు దక్కడం లేదు. 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమా చాలా తక్కువ కలెక్షన్లనే తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది. మరి టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

sk