సినీ ప్రపంచంలో జ్యోతిష్యానికి చాలా డిమాండ్ ఉంది. సినిమా రిలీజ్, హీరో-హీరోయిన్‌-డైరెక్ట‌ర్ల‌ కెరీర్, బాక్సాఫీస్ ఫలితాలు.. ఇవన్నీ భవిష్యత్తులో ఎలా ఉంటాయో ముందుగానే చెప్పగలిగే జ్యోతిష్కులకు ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి పేరుగాంచిన వ్యక్తుల్లో వేణు స్వామి ఒక‌రు. కొంద‌రు ఆయ‌న్ను సినిమా జ్యోతిష్యుడు కూడా పిలుస్తారు. ఆయన చెప్పిన కొన్ని ప్రిడిక్షన్స్ నిజమవ్వడంతో వేణు స్వామికి విప‌రీత‌మైన హైప్ వ‌చ్చింది. అందుకు తోడు కొంద‌రు హీరోయిన్లు ఆయ‌న చేత ప్ర‌త్యేకంగా పూజ‌లు చేయించుకోవ‌డం మ‌రింత పాపుల‌రిటీ తెచ్చిపెట్టింది.


ఇదిలా ఉంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాత‌కం గురించి వేణు స్వామి గ‌తంలో చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు మ‌రోసారి నెట్టింట వైర‌ల్ గా మారాయి. అల్లుఅర్జున్ జాతకం అద్భుతంగా ఉంద‌ని వేణు స్వామి పేర్కొన్నారు. బన్నీ రేంజ్ ఇప్పుడు మ‌రే హీరోకు లేదు.. ఆయ‌న పాన్ ఇండియన్ సూపర్ స్టార్.. రాబోయే ప‌దేళ్లు ఆయ‌న కెరీర్ స‌క్సెస్ ఫుల్ గా సాగిపోతుంది. ఆయ‌న సినిమాకు తిరుగు ఉండ‌దు. దేశంలోనే నెం. 1 స్థానంలో ఉంటారు అని వేణు స్వామి చెప్పుకొచ్చారు.


అయితే ఈమ‌ధ్య కాలంలో బ‌న్నీ చాలా స్ట్ర‌గ్గుల్స్ ఫేస్ చేశారు. ముఖ్యంగా పుష్ప 2 రిలీజ్ త‌ర్వాత జైలుకు వెళ్లొచ్చారు. దాని సంగ‌తి ఏంట‌ని ప్ర‌శ్నించ‌గా.. వేణు స్వామి ఆస‌క్తిక‌ర బ‌దులిచ్చారు. అల్లు జైలుకు వెళ్లాడు, కారాగార దోషం ఉంటేనే అలా జరుగుతుంది. ఆయ‌న జాతకంలో శని ఆరోగదిలో ఉండటం వల్ల జైలుకు వెళ్లడం జరిగింది. అయితే జైలుకి వెళ్లినంత మాత్రాన‌ ఇమేజ్ పోదు, రాజయోగం వస్తుంది. పెద్ద పెద్ద నాయకులంతా జైలుకి వెళ్ళాకే సీఎంలు అయ్యారు. అల్లు అర్జున్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. ఆయ‌న ఇండియన్ సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలుగ‌డం ఖాయ‌మ‌ని వేణు స్వామి చెప్పుకొచ్చారు. దీంతో ఈ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు భిన్న‌ర‌కాలుగా రియాక్ట్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: