గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో మన తెలుగు ప్రజలు స్టార్ హీరోలు నటించిన సినిమాలకు కూడా హిట్ టాక్ రాకపోతే వెళ్లడం మానేస్తున్నారు. అదే చిన్న హీరో నటించిన సినిమాలకైనా , తక్కువ బడ్జెట్లో రూపొందిన సినిమాలకైనా మంచి టాక్ వచ్చి సినిమా బాగుంది అని తెలిస్తే చాలు పెద్ద ఎత్తున ఆ సినిమాను చూడడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. దానితో ఈ మధ్య కాలంలో అనేక చిన్న సినిమాలు చిన్న చిన్న హీరోలు నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన లాభాలను అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా మౌళి అనే నటుడు లిటిల్ హాట్స్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాను అత్యంత తక్కువ బడ్జెట్ తో రూపొందించారు. కానీ ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దానితో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు సూపర్ సాలిడ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు ఇప్పటికి కూడా దక్కుతున్నాయి.

ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన రెండు వారాల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ రెండు వారాల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 13.38 కోట్ల షేర్ ... 24.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రెండు వారాల్లో 18.76 కోట్ల షేర్ ... 35.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3 ప్లస్ కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. దానితో ఇప్పటివరకు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 15.76 కోట్ల లాభాలు వచ్చాయి. దానితో ఈ మూవీ ఇప్పటికే అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: