
అయితే మరోవైపు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కారణమేమోనని కూడా పెద్ద ఎత్తున గాసిప్స్ వస్తున్నాయి. ఆయన కారణంగానే దీపికను తప్పించారని చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. కానీ వాస్తవానికి అది నిజం కాదని ఇండస్ట్రీలో చెప్తున్నారు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగా సినిమా నుంచి దీపికా పదుకొనెను తొలగించడం కాదు, అంతకంటే ముందే మరో తెలుగు సినిమాలో ఆమె రిజెక్ట్ అయ్యిందన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఆ సినిమా మరెవరిదో కాదు—నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా శృతిహాసన్, మరో హీరోయిన్‌గా హనీ రోజ్ నటించారు. కానీ శృతిహాసన్ పాత్ర కోసం మొదట దీపికా పదుకొనెను కాస్ట్ చేయాలని భావించారట. డైరెక్టర్ గోపిచంద్ మలినేని కూడా దీపికా పేరును ముందుకు తెచ్చి, సినిమాకి మంచి హైప్ వస్తుందని అనుకున్నారట. కానీ ఈ ప్రపోజల్‌ని బాలయ్య తేలికగా ఒప్పుకోలేదట.
బాలయ్య అప్పుడు స్పష్టంగా చెప్పిన మాటల్లో, “ఆమె మన సినిమాకి సరిపడదు. ఆమె రియల్ క్యారెక్టర్, ఆమె డిమాండ్స్, ఆమె రేమ్యూనరేషన్ మన సినిమాకి భారం అవుతాయి. మనం ఆమెని మేనేజ్ చేయలేం” అని చెప్పి, దీపికా పేరుని నేరుగా రిజెక్ట్ చేశారట. దీంతో ఆ అవకాశం శృతిహాసన్‌కి దక్కింది. ఇదే విషయం ఇప్పుడు మళ్లీ బయటకు రావడంతో సోషల్ మీడియాలో బాలయ్య నిర్ణయం ఎంత సరైనదో అని కొందరు చెబుతున్నారు. “, బాలయ్య అప్పుడే దీపికా అసలు స్వభావం గుర్తించాడు, అందుకే తన సినిమా నుంచి దూరం పెట్టేశాడు” అని జనాలు కామెంట్లు చేస్తున్నారు.
మొత్తానికి, దీపికా పదుకొనె విషయంలో ఇండస్ట్రీలో వేర్వేరు కోణాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఒక వైపు ఆమెపై ఆరోపణలు వస్తుంటే, మరోవైపు పెద్ద పెద్ద సినిమాల నుంచి రిజెక్షన్లు ఎదురవుతున్నాయి. స్పిరిట్ స్టోరీ లీక్ వివాదమే అయినా, లేక బాలయ్య అప్పటి నిర్ణయం అయినా, ఇప్పుడు అన్నీ ఆమె కెరీర్‌పై నెగిటివ్ ఇంప్యాక్ట్ చూపుతున్నాయి..!!