ఇది నిజంగా హీరోయిన్ సమంత అభిమానులకి వెరీ గుడ్ న్యూస్ అని చెప్పాలి. గత కొంతకాలంగా సమంతపై తెలుగు సినీ ఇండస్ట్రీలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. సమంత తెలుగు ఇండస్ట్రీని పూర్తిగా దూరం పెట్టేసింది.  ఇప్పుడు ఆమె ఓన్లీ బాలీవుడ్ సినిమాలు మాత్రమే సైన్ చేస్తుంది, అలాగే వెబ్ సిరీస్‌లపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని చాలామంది అనుకుంటూ వచ్చారు. ఈ చర్చలకి కారణం రాజ్ నిడమూరుతో ఉన్న అనుబంధమే అని కూడా కొందరు మీడియా వర్గాలు రాసుకొచ్చాయి. దీని వలన సమంత తెలుగు అభిమానులు మాత్రం బాగా నిరాశకు గురయ్యారు. "ఎందుకు సమంత తెలుగు సినిమాలు చేయడం లేదు?" అంటూ సోషల్ మీడియాలో, ఫ్యాన్ పేజీల్లో ఫీల్ అవుతూ చర్చలు జరిగాయి. అయితే అలాంటి అభిమానులందరికీ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ రాబోతోందని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.


తెలుగు మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. హీరోయిన్ సమంత మళ్ళీ ఒక తెలుగు సినిమాకి సైన్ చేసిందట. అదీ మరెవరో కాదు, స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో నే అని తెలుస్తుంది.  ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పూర్తయ్యాక, ఎన్టీఆర్త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా "మురుగన్" కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కబోతుందని తెలుస్తుంది.  అందులో హీరోయిన్ గా సమంతని త్రివిక్రమ్ ఫిక్స్ చేసారని సమాచారం. గతంలో ‘జీగ్రా’ ప్రమోషన్ల సమయంలో త్రివిక్రమ్ ప్రత్యేకంగా సమంతతో మాట్లాడుతూ, “మీరు తప్పకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేయాలి, మీకు ఇక్కడ కూడా మంచి క్రేజ్ ఉంది” అని చెప్పారు. దానికి సమంత కూడా, “బాగున్న కథలు వస్తే తప్పకుండా చేస్తాను” అని స్పష్టంగా స్పందించింది. ఇప్పుడు ఆమె మాట నిలబెట్టుకున్నట్లు ఉంది.



సమంత – జూనియర్ ఎన్టీఆర్ కాంబో మళ్లీ రాబోతున్నట్లు కన్ఫర్మ్ అయింది. ఒకప్పుడు ఈ ఇద్దరి జంట బృందావనం, ‘జనతా గ్యారేజ్’ వంటి సినిమాల్లో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్‌టైన్ చేశారు. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ స్క్రీన్‌పై రచ్చ రంబోలా చేయనుందన్న ఉత్సాహం అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి, సమంత అభిమానులకి ఇది నిజంగానే ఒక వెరీ హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: