టాలీవుడ్‌ ఇండస్ట్రీలో స్టార్ హీరోల విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆయన ఎంతటి స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారో అందరికీ తెలిసిందే. అలాంటి ఎన్టీఆర్ ఇటీవల ఒక ప్రమాదంలో చిక్కుకోవడం ఇండస్ట్రీలోనే కాకుండా ఆయన అభిమానులందరికీ షాక్ ఇచ్చిన విషయమే. వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ ప్రైవేట్ యాడ్ షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షూటింగ్ సమయంలో జరిగిన నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి యూనిట్ సభ్యులు అలర్ట్‌ అయ్యి ఎన్టీఆర్‌ను సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వైద్యులు అవసరమైన పరీక్షలు చేసి, పూర్తి మెడికల్ చెకప్ చేసిన తర్వాత ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, కానీ ఎడమ కాలికి గాయం అయినట్లు తేలిందని సమాచారం.


డాక్టర్లు ఆయనకు కొంతకాలం పూర్తి విశ్రాంతి తీసుకోవాలని గట్టిగా సూచించారు. ముఖ్యంగా డాన్స్, స్టంట్స్ లేదా ఏ విధమైన ప్రెజర్ పడే పనులు చేయకుండా మూడు నెలలపాటు షూటింగ్లకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చారని తెలిసింది. సాధారణంగా ఎన్టీఆర్ ఎప్పుడూ షూటింగ్ లకి బ్రేక్ చెప్పకుండా పనిచేసే హీరో. కానీ ఈ సారి పరిస్థితులు వేరుగా ఉండటంతో ఆయన కూడా డాక్టర్ల సలహాను తప్పక పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఆయన ప్రస్తుతం చేస్తున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తిగా దెబ్బతింది. ఇప్పటికే ప్లాన్ చేసిన షెడ్యూల్స్ అన్నీ వాయిదా పడ్డాయి. దీంతో సినిమా యూనిట్‌కి, ముఖ్యంగా మిగతా నటీనటులు, టెక్నీషియన్లకు కూడా ఇబ్బందులు తప్పవని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.



అయితే అభిమానులు మాత్రం ఎన్టీఆర్ ఆరోగ్యం కంటే గొప్పది ఏదీ లేదని చెబుతున్నారు. “మూడు నెలలు కాకపోయినా ఆరు నెలలు పట్టినా పర్వాలేదు. కానీ ఆయన పూర్తిగా కోలుకోవాలి, హెల్త్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోరాదు” అని కోరుకుంటున్నారు. టాలీవుడ్ మొత్తంలో కూడా ప్రస్తుతం ఎన్టీఆర్ క్షేమంగానే ఉండాలని, ఆయన త్వరగా తిరిగి షూటింగ్‌కి రావాలని కోరుకుంటున్నారు. మొత్తం మీద, ఈ ప్రమాదం కారణంగా ఎన్టీఆర్ సినిమా షూటింగ్లకు పెద్ద బ్రేక్ పడింది. అయినప్పటికీ ఆయన అభిమానులు, ఇండస్ట్రీలోని పెద్దలు ఒకే మాట చెబుతున్నారు – "హెల్త్ ఈజ్ ఫస్ట్ ప్రాధాన్యం.. ఎన్టీఆర్ ఆరోగ్యంగానే ఉండాలి, సినిమాలు తర్వాత కూడా చేస్తారు."

మరింత సమాచారం తెలుసుకోండి: