
నటసింహం నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ ఎప్పుడూ హిట్ ఫార్ములానే. ఈ జోడీ ఇచ్చిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సాధించడంతో ఇప్పుడు వారి కాంబినేషన్లో వస్తోన్న అఖండ 2 – తాండవంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఇప్పటికే టాలీవుడ్‌లోనే కాకుండా నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారింది. అఖండ 2 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సంయుక్త మీనన్ నటిస్తోంది. బాలయ్య – సంయుక్త కాంబినేషన్ సరికొత్తగా ఉండబోతోందన్న అంచనాలు ఉన్నాయి. భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఎస్ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ యూట్యూబ్‌లో ట్రెండ్ సృష్టించి, అభిమానుల్లో ఉత్సాహం రేకెత్తించింది.
బాలయ్యకు పవర్‌ఫుల్ డైలాగ్స్, బోయపాటి శైలి మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ కలగలిపి అఖండ 2 థియేటర్లలో తాండవం ఆడేస్తుందంటున్నారు. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట గ్రాండ్ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉండగా, ఈ సినిమా ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. ఇదిలా ఉంటే అఖండ 2 - తాండవం ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు కొల్లగొడుతుందన్న దానిపై ట్రేడ్ వర్గాల్లో రకరకాల చర్చలు, అంచనాలు మొదలయ్యాయి. బాలయ్య వీరసింహారెడ్డి సినిమాకే ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రు. 54 కోట్లు వచ్చింది. ఆ సినిమా యావరేజ్ కంటెంట్‌తో వచ్చింది. ఇప్పుడు బాలయ్య ఫామ్ చూస్తుంటే అఖండ 2 ఫస్ట్ డే రు. 80 - 100 కోట్ల మధ్యలో వసూళ్లు కొల్లగొడుతుందని లెక్కలు కడుతున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు