టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “ఓజీ” కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా భారీ హైప్ తో థియేట‌ర్ల‌లోకి దిగుతోంది. ముఖ్యంగా అమెరికా, కెనడా ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు దుమ్ము రేపుతాయని, తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రీ-సేల్స్‌లో ఈ సినిమా అద్భుతమైన రికార్డులు సాధించింది. ఇంత భారీ అంచనాల మధ్య, సినిమా కంటెంట్ డెలివరీ సమస్యలు అభిమానుల్లో టెన్షన్ పెంచాయి. దీంతో ఫ్యాన్స్ గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నారు. ముందు ఓజీ సినిమా రెండో భాగం కంటెంట్ ఇంకా ఓవర్సీస్‌కు చేరలేదు. దీంతో షెడ్యూల్ చేసిన అనేక ప్రీమియర్ షోలు రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వార్తలు వెలువడుతున్నాయి.


మ‌రీ ముఖ్యంగా AMC లాంటి పెద్ద థియేటర్ చైన్స్‌కు ముందుగానే హార్డ్ డ్రైవ్స్ రూపంలో కంటెంట్ అందాల్సి ఉంటుంది. కానీ ఆ ప్రక్రియ ఆలస్యమవడంతో అక్కడి బుకింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదని అంటున్నారు. దీంతో ప్రీమియర్ కలెక్షన్లపై ప్రభావం పడటం ఖాయం. ఇప్పటికే ప్రీ-సేల్స్ రికార్డులు బ్రేక్ చేసినా, ఫైనల్ ప్రీమియర్ నంబర్స్ ఆశించినంతగా రావడం కష్టమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మ్యాట‌ర్‌ అభిమానుల్లో నిరాశ కలిగిస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు మాత్రం కంటెంట్ త్వరలోనే పంపబడుతుందని నమ్మకంగా చెబుతున్నారు. అయితే బుధ‌వారం ఉద‌యానికి ప‌రిస్థితి అంతా స‌ద్దుమ‌ణిగింద‌ని తెలుస్తోంది. ఏదేమైనా రిలీజ్‌కు ముందు అన్నీ ప‌క్కాగా ప్లాన్ చేసుకోవాల్సిన నిర్మాత దాన‌య్య గారు ఎంద‌కిలా చేశార‌న్న‌ది అర్థం కావ‌డం లేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: