గత కొంత కాలంగా మన తెలుగు ప్రేక్షకులు చిన్న సినిమాలకు పెద్ద ఎత్తున ఆదరిస్తూ వస్తున్నారు. కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు , పెద్దగా స్టార్ కాస్ట్ లేని సినిమాలు కూడా విడుదల అయ్యాక మంచి టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ లుగా నిలచిన సందర్భాలు ఉన్నాయి. అలా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సా ఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకున్న మూవీలలో మ్యాడ్ మూవీ ఒకటి. ఈ సినిమా 2023 వ సంవత్సరం అక్టోబర్ 6 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ బాక్సా ఫీస్ దగ్గర వచ్చింది. దానితో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో రెండు సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సినిమా విడుదల అయ్యి రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ సినిమా ఆ సమయంలో ఎన్ని కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి నైజాం ఏరియాలో 3.50 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో ఒక కోటి , ఉత్తరాంధ్రలో రెండు కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 6.50 కోట్ల కలెక్షన్లు దక్కాయి. రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్ సిస్ లలో కలుపుకొని 2.50 కోట్లు. మొత్తం గా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 9 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 1.5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 1.8 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 9 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: