
ఈ సినిమాలో మహేష్ బాబును ఇప్పటివరకు చూడని విధంగా కొత్త లుక్, కొత్త ఎనర్జీతో రాజమౌళి చూపించబోతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ముఖ్యంగా మహేష్‌లోని డ్యాన్సర్‌ను బయటకు తీసుకురావడానికి రాజమౌళి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో ఓ ఫోక్ సాంగ్‌కు ప్రాధాన్యత ఉండనుంది. ఆ పాటకు కీరవాణి అద్భుతమైన మ్యూజిక్ అందిస్తుండగా, రాజు సుందరం ప్రత్యేకమైన కొరియోగ్రఫీ రూపకల్పన చేస్తున్నాడు. ఆ ఫోక్ సాంగ్‌లో మహేష్ బాబు, హీరోయిన్ ప్రియాంక చోప్రా కలిసి కొత్త స్టైల్లో డ్యాన్స్ చేయబోతున్నారని యూనిట్ వర్గాలు వెల్లడించాయి.
మహేష్ స్టెప్స్, ప్రియాంక చోప్రా గ్లామర్, కీరవాణి ట్యూన్స్ కలయిక ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని మేకర్స్ చెబుతున్నారు. అలాగే ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అతని రోల్ కథలో ముఖ్యమైన మలుపుకు కారణమవుతుందట. ఈ సినిమాపై మరిన్ని ఆసక్తికర అప్డేట్స్‌ను నవంబర్ నెలలో అధికారికంగా ప్రకటించేందుకు యూనిట్ సిద్ధమవుతోంది. మహేష్-రాజమౌళి కాంబినేషన్ నుండి భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఈ సినిమా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సరికొత్త మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు విశ్వసిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.