ప్రముఖ దర్శకులలో ఒకరైన కొరటాల శివ నెక్స్ట్ మూవీ ఏంటనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఎంతగానో నెలకొంది . నిజానికి జూనియర్ ఎన్టీఆర్ తో దేవర 2 చేయాల్సి ఉంది . కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ ఇతర చిత్రాలతో బిజీగా ఉండడంతో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లడానికి కొంత టైం పట్టేలా కనిపిస్తుంది . దీంతో ఈ గ్యాప్ లో మరో సినిమా చేసే ప్రయత్నంలో ఉన్నాడు కొరటాల శివ . ఈ క్రమంలోనే నాగచైతన్య మరియు బాలకృష్ణ వంటి హీరోల పేర్లు వినిపిస్తున్నాయి .


ఇప్పుడు అనూహ్యంగా వెంకటేష్ పేరు కూడా తెరమీదకి వచ్చింది . సంక్రాంతి వస్తున్నాం చిత్రంతో సూపర్ హిట్ అందుకుని ఫుల్ జోష్ లో ఉన్నాడు వెంకటేష్ . ఇక ప్రస్తుతం చిరంజీవి మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న మన శంకర్ ప్రసాద్ గారు మూవీలో ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాడు . అదేవిధంగా త్రివిక్రమ్ డైరెక్షన్లో మూవీ చేయనున్నాడు వెంకటేష్ . దీని అనంతరం కొరటాల డైరెక్షన్లో ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్లు సమాచారం . వెంకటేష్ కోసం కొరటాల ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదా నువ్వు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది .


ఇప్పటికే ఇద్దరి మధ్య కథ చర్చలు జరిగాయని త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వస్తుందని కొందరు అంటున్నారు . ఇక బాలకృష్ణ కూడా పొలిటికల్ జోనర్ స్క్రిప్ట్ ను కొరటాల రెడీ చేసినట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి . అయితే ఇప్పటికే బాలయ్య చేతిలో పలు సినిమాలు ఉన్నాయి . ఇవి పూర్తి కాగడానికి చాలా టైం పడుతుంది . అందువలనే కొరటాల ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ అని పక్కనపెట్టి వెంకటేష్ తో సినిమా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: